K-RAMP: 3 ఔట్.. ఇప్పుడు అందరి చూపు కిరణ్ పైనే..!

దీపావళి కానుకగా 4 సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యాయి. ఇందులో 3 స్ట్రైట్ తెలుగు సినిమాలు కాగా ఒకటి డబ్బింగ్ సినిమా. అది కూడా తెలుగు నిర్మాతలు నిర్మించిన సినిమానే.! అవే సిద్ధు జొన్నలగడ్డ ‘తెలుసు కదా’, ప్రియదర్శి అండ్ కో నటించిన ‘మిత్రమండలి’, ప్రదీప్ రంగనాథన్ నటించిన ‘డ్యూడ్’, కిరణ్ అబ్బవరం నటించిన ‘K-RAMP’. ఇవి పెద్ద సినిమాలు కాదు కానీ.. వేటికవే ప్రత్యేకమైనవే.

K-RAMP

మౌత్ టాక్ కనుక పాజిటివ్ గా తెచ్చుకుంటే.. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు కురిపించే సినిమాలే. ‘మిత్రమండలి’ కి బన్నీ వాస్ బ్యాకప్ ఉంది. ప్రియదర్శి సినిమా కాబట్టి.. జనాలకు నమ్మకం ఉంది. ప్రదీప్ రంగనాథన్ నటించిన ‘డ్యూడ్’ సినిమాని అగ్ర నిర్మాణ సంస్థ అయిన ‘మైత్రి మూవీ మేకర్స్’ నిర్మించింది. ‘తెలుసు కదా’ విషయానికి వస్తే.. అది సిద్ధు జొన్నలగడ్డ వంటి క్రేజీ హీరో నటించిన సినిమా. ఇక కిరణ్ అబ్బవరం ‘క’ పై కూడా యూత్ ఫోకస్ ఉంది.

అయితే ఈ 4 లో ఆల్రెడీ 3 సినిమాలు బయటకు వచ్చాయి. ముందుగా ‘మిత్రమండలి’ వచ్చింది. మొదటి షోతోనే డిజాస్టర్ టాక్ మూటగట్టుకుంది. బాక్సాఫీస్ వద్ద మెరుపులు మెరిపించలేకపోతుంది. దీపావళి పండుగ వీకెండ్ ముగిశాక ఈ సినిమా నిలబడటం కష్టం. తర్వాత ‘తెలుసు కదా’ వచ్చింది. ఆ సినిమాకి పర్వాలేదు అనిపించే రిపోర్ట్స్ వచ్చాయి. కానీ బజ్ లేకపోవడం వల్ల ఇది కూడా క్యాష్ చేసుకునే అవకాశం లేదు.

ఇక దీపావళి విన్నర్ గా నిలుస్తుంది అనుకున్న ‘డ్యూడ్’ యావరేజ్ రిపోర్ట్స్ మాత్రమే సొంతం చేసుకుంది. అయినప్పటికీ మంచి ఓపెనింగ్స్ తెచ్చుకునే అవకాశాలు ఉన్నాయి. ఇక ఇప్పుడు మిగిలింది కిరణ్ అబ్బవరం ‘K-RAMP’. సోషల్ మీడియాలో అయితే దీనిపై పాజిటివ్ బజ్ ఉంది. టాక్ కనుక పాజిటివ్ గా వస్తే.. అడ్వాన్స్ బుకింగ్స్ పెరిగే అవకాశం ఉంది. అలాగే దీపావళి విన్నర్ గా కూడా నిలిచే అవకాశం ఉంది.

డ్యూడ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus