కార్తికేయ పెళ్లాడే అమ్మాయి గురించి మీకు తెలుసా?

దర్శకధీరుడు ఎస్. ఎస్. రాజమౌళి తనయుడు కార్తికేయ తాను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నారు. నిన్న నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. ఈ వేడుకకి సంబంధించిన ఫోటోలు నిన్న సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో ఆమె ఎవరు? రాజమౌళి కోడలికి తగ్గ క్వాలిటీలు ఉన్నాయా? కనీసం కార్తికేయపై సరిజోడినా? అని సినీ అభిమానులు ఆరా తీయడం మొదలు పెట్టారు. ఆమె గురించి ఆరా తీస్తే ఎన్నో విషయాలు తెలిసాయి. కార్తికేయ మనసు దోచుకున్న అమ్మాయి పేరు పూజ. జగపతి బాబు అన్న కుమార్తె. సినీ నేపథ్య కుటుంబంలోని అమ్మాయి. ఇక పూజ మంచి భక్తురాలు.

ఫిలింనగర్ దైవసన్నిధానంలో తాత విబి.రాజేంద్రప్రసాద్ ఈవెంట్లలో తనే కర్తకర్మక్రియ. బాగా చదువుకుంది. అంతే కాదు తనో మంచి గాయని. కర్నాటిక్ సంగీతవిధ్వాంసురాలు. “మాధవ కేశవ…”అంటూ రవీంద్రభారతి వేదికపై పూజ పాడిన భక్తిగీతం ఎంతో ఆకట్టుకుంది. ఆ వీడియోలో పూజా స్టేజ్ ప్రెజెన్స్ ఆకట్టుకుంది. ఇలా ఎన్నో క్వాలిటీస్ ఉన్నాయి. ప్రేమ చిగురించేటప్పుడు ఈ క్వాలిటీలు చూసుకోదు. బలపడేటప్పుడు అభిరుచులతో పనిలేదు. కానీ పెళ్ళికి మాత్రం ఇద్దరి కుటుంసభ్యుల అంగీకారం ఉండాలి. కార్తికేయ కూడా తండ్రికి తగ్గ తనయుడిగా నిరూపించుకున్నారు. బాగా సంపాదిస్తున్నారు కూడా. సో ఇద్దరూ సరితూగారు. అందుకే ఆశీర్వదించి నిశ్చితార్ధం చేశారు. ఈ ఏడాది చివర్లో పెళ్లి చేయనున్నట్లు తెలిసింది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus