సమంతను పోలి ఉన్న ఈ అమ్మాయిల గురించి తెలుసా..?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంతను అభిమానించే అభిమానులు కోట్ల సంఖ్యలో ఉన్నారు. సమంత గ్లామరస్ రోల్స్ చేసినా, డీ గ్లామరస్ రోల్స్ చేసినా, నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రల్లో, పౌరాణిక పాత్రల్లో నటిస్తున్నా అభిమానులు ఆమెను అభిమానిస్తూనే ఉన్నారు. అయితే సమంతను పోలి ఉన్న జూనియర్ సమంతలు కూడా ఇండస్ట్రీలో ఉన్నారు. సరిగ్గా పరిశీలిస్తే మాత్రమే ఒరిజినల్ సమంత ఎవరో సమంతను పోలి ఉన్న అమ్మాయిలు ఎవరో గుర్తు పట్టగలుగుతాం.

సమంతలా ఉంటూ అభిమానులను సంపాదించుకున్న టిక్ టాక్ స్టార్ అషురెడ్డి. బిగ్ బాస్ సీజన్ 3లో పాల్గొన్న అషురెడ్డి ఆ షో ద్వారా పేరు, గుర్తింపు, పాపులారిటీని సంపాదించుకున్నారు. లుక్స్ పరంగా సమంత కు ఏ మాత్రం తీసిపోకుండా ఉన్న అషురెడ్డి చేసిన వీడియోలు నెట్టింట తెగ వైరల్ అయ్యాయి. అచ్చంగా సమంతలా కనిపిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న అషురెడ్డి పలు టీవీ షోలలో, ఈవెంట్లలో, గేమ్ షోలలో కూడా అప్పుడప్పుడూ సందడి చేస్తున్నారు.

సమంతను పోలి ఉన్న మరో నటి పేరు ఆత్మిక. నెటిజన్లచే జూనియర్ సమంతగా పిలవబడుతున్న ఈ ముద్దుగుమ్మ హీరోయిన్ సమంతలా బుంగమూతి పెడుతూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. సమంతను పోలిన ఇద్దరు అమ్మాయిలను గుర్తించిన అభిమానులు మిగతా నలుగురు జూనియర్ సమంతలు కూడా ఉండే ఉంటారని కామెంట్లు చేస్తున్నారు. సమంత డ్యూయల్ రోల్ చేస్తే ఒక పాత్రలో సమంత నటించినా మరొక పాత్ర కోసం అషురెడ్డి, ఆత్మికలను తీసుకుంటే సెట్ అవుతారు.

అషురెడ్డి, ఆత్మిక సోషల్ మీడియాలో ఈ మధ్య కాలంలో కొన్ని ఫోటోలు షేర్ చేయగా ఆ ఫోటోలొ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఇలా సెలబ్రిటీలను పోలి ఉన్నవారికి టీవీ షోలలో, వెబ్ సిరీస్ లలో ఆఫర్లు వస్తున్నాయి. అషురెడ్డి, ఆత్మిక కూడా తమతమ రంగాల్లో బిజీగా ఉండి సెలబ్రిటీలుగా గుర్తింపు సంపాదించుకోవడం గమనార్హం.

Most Recommended Video

తన 11 ఏళ్ళ కేరీర్లో సమంత మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!
నాని కొన్ని హిట్ సినిమాలను కూడా మిస్ చేసుకున్నాడు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus