Jayasudha: హీరోయిన్ గా ఇండస్ట్రీలో సక్సెస్ సాధించలేకపోయినా జయసుధ కుమార్తె?

దక్షిణాది సినీ ఇండస్ట్రీలో సీనియర్ నటిగా ఎంతోమంది స్టార్ హీరోల సినిమాలలో నటించి నటిగా ఎంతో మంచి గుర్తింపు పొందిన సహజ నటి జయసుధ గురించి పరిచయం అవసరం లేదు. ఇండస్ట్రీలో తెలుగు తమిళ భాషలలో ఈమె సుమారు 300కు పైగా సినిమాలలో నటించి ఎంతో గుర్తింపు పొందారు.ఇలా ఇండస్ట్రీలో హీరోయిన్ తో ఎంతో మంచి సక్సెస్ అయినటువంటి జయసుధ తన సోదరి సుభాషిణిని కూడా ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయం చేశారు.

అయితే ఈమె సోదరి కూడా హీరోయిన్ అనే విషయం చాలా మందికి తెలియదు. ఇలా ఈమె కెరీర్ మొదట్లో బుల్లితెర సీరియల్స్ లో నటించారు. బుల్లితెరపై ప్రసారమవుతున్నటువంటి నాగాస్త్ర, సుందరకాండ వంటి సీరియల్స్ లో నటించారు. అనంతరం వెండితెరపై సీతయ్య అరుంధతి వంటి పెద్ద సినిమాలలో సుభాషిని నటించిన ఆమె మాత్రం జయసుధ స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయారు.

ఈ విధంగా సుభాషిని హీరోయిన్గా ఇండస్ట్రీలో సక్సెస్ కాకపోయినప్పటికీ తన కుమార్తె పూజ ప్రియాంకను కూడా ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయం చేశారు. ఇలా జయసుధకు ఈమె కూతురు వరస అయినప్పటికీ జయసుధ స్థాయిలో ఈమె కూడా సక్సెస్ అందుకోలేకపోయారు. పూజ ప్రియాంక పూరి జగన్నాథ్ తమ్ముడు రామ్ శంకర్ నటించిన 143 అనే సినిమాలో సెకండ్ హీరోయిన్ గా పూజ ప్రియాంక నటించారు.

ఇలా ఈ సినిమాలో ఈమె (Jayasudha) నటించినప్పటికీ పెద్దగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోలేకపోయారు. ఇలా తల్లి కూతుర్లు ఇద్దరు కూడా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి సక్సెస్ కాకపోవడంతో వీరిద్దరూ ఇండస్ట్రీకి దూరమయ్యారు. ఇక పూజ ప్రియాంక ఇండస్ట్రీలో సక్సెస్ సాధించకపోవడంతో పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా గడుపుతున్నారు.

అశ్విన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

ఆ హీరోయిన్లలా ఫిట్ నెస్ కంటిన్యూ చేయాలంటే కష్టమే?
తన 16 ఏళ్ళ కెరీర్లో కాజల్ రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus