Actress Lakshmi Daughter: సీనియర్ నటి లక్ష్మి కూతురు కూడా టాలీవుడ్ హీరోయిన్ అనే సంగతి తెలుసా?

ఎర్రగుడిపాటి వెంకట మహాలక్ష్మి ఇలా చెబితే చాలా మందికి అర్థం కాదేమో. అదే సీనియర్ నటి లక్ష్మి అంటే కొంతమందికి అర్ధం అవుతుంది. అప్పట్లో ఈమె కూడా హీరోయిన్ గా స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది. కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు వంటి స్టార్ హీరోలతో కలిసి నటించింది. అయితే హీరోయిన్ గా కంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానే స్టార్ స్టేటస్ అందుకుంది అని చెప్పాలి. ‘నిన్నే పెళ్ళాడతా’ ‘మురారి’ ‘నరసింహ’ ‘మిథునం’ ‘ఓ బేబీ’ వంటి సినిమాల్లో ఈమె నటనతో ప్రశంసలు అందుకుంది.

Actress Lakshmi

అయితే లక్ష్మీ పర్సనల్ లైఫ్ గురించి చాలా మందికి తెలిసుండదు. ముఖ్యంగా ఆమె 3 పెళ్లిళ్లు చేసుకున్నారు అనే సంగతి ఎక్కువ మందికి తెలియకపోవచ్చు. ఈమె 1969 లో భాస్కర్ అనే వ్యక్తిని పెళ్లాడింది. అయితే 1974 లో వీళ్ళు విడిపోయారు. 1975 లో సహనటుడు మోహన్ శర్మని పెళ్లి చేసుకుంది. 1980 లో అతనితో కూడా విడిపోయింది. ఆ తర్వాత అంటే 1987 లో శివ చంద్రన్ ని పెళ్లి చేసుకుంది.

అయితే మొదటి భర్త భాస్కర్ – లక్ష్మీ..లకి ఓ కుమార్తె ఉంది. ఆమె పేరు ఐశ్వర్య భాస్కర్. ఈమె టాలీవుడ్లో హీరోయిన్ గా సినిమాలు చేసింది అనే సంగతి ఎక్కువ మందికి తెలిసుండకపోవచ్చు. జగపతి బాబు హీరోగా తెరకెక్కిన ‘అడవిలో అభిమన్యుడు’ సినిమాతో ఈమె హీరోయిన్ గా డెబ్యూ ఇచ్చింది. తర్వాత రాజేంద్రప్రసాద్ హీరోగా నటించిన ‘ప్రేమ జిందాబాద్’ సినిమాలో కూడా హీరోయిన్ గా నటించింది.

అయితే ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో దాసరి నారాయణరావు, వినోద్ కుమార్ ప్రధాన పాత్రల్లో తెరకెక్క్కిన ‘మామగారు’ సినిమాలో కూడా ఈమె హీరోయిన్ గా నటించింది. ఆ సినిమాతో మంచి క్రేజ్ సంపాదించుకుంది. కానీ స్టార్ గా ఎదగలేదు. తర్వాత ‘అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి’ ‘నాని’ ‘ధైర్యం’ వంటి సినిమాల్లో నటించింది. ఇటీవల వచ్చిన ‘కన్నప్ప’ సినిమాలో కూడా కీలక పాత్ర పోషించింది.

బ్లాక్ బస్టర్ సినిమా.. డైరెక్టర్ పారితోషికం లక్ష.. సినిమాటోగ్రాఫర్ పారితోషికం రూ.8 లక్షలు..!

 

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus