లేడీ సూపర్ స్టార్.. లేడీ అమితాబచ్చన్ విజయశాంతి అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలకు ఇప్పటికీ ఒక క్రేజ్. 1980 తర్వాత జనరేషన్ సినీ అభిమానులు అందరికీ విజయశాంతి అంటే ఎంతో ఇష్టం. ఆ రోజుల్లో హీరోయిన్గా సినిమాలు చేస్తూనే లేడీ ఓరియంటెడ్ పాత్రలలో కూడా చేసి సూపర్ డూపర్ హిట్లు కొట్టిన ఘనత విజయశాంతి సొంతం. అప్పట్లో లేడీ ఓరియంటెడ్ పాత్రల్లో విజయశాంతి సినిమాలు సూపర్ హిట్ అవడంతో టాలీవుడ్ స్టార్ హీరోలు సైతం షాక్ అయ్యారు.
ముఖ్యంగా కర్తవ్యం, ప్రతిఘటన సినిమాలు విజయశాంతి ఇమేజ్‌ను శిఖరాగ్రాణ నిలిపాయి. ఆ రోజుల్లో స్టార్ హీరోలతో సమానంగా రెమ్యూనరేషన్ డిమాండ్ చేసిన ఘనత విజయశాంతిదే. అటు సినిమా రంగంలో అయినా.. ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చి ఎంపీ అయినా, ఎమ్మెల్యేగా పోటీ చేసినా.. ప్రత్యేక తెలంగాణ కోసం తల్లి తెలంగాణ పార్టీ పెట్టిన ఆమె చేసిన ఒక సంచలనమే అయ్యింది. ఇక విజయశాంతి నందమూరి కుటుంబానికి సమీప బంధువు అయినా శ్రీనివాస ప్రసాద్ ను ప్రేమ వివాహం చేసుకుంది.
ఆమె కెరీర్ పరంగా ఫామ్ లో ఉండగానే వీరు ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. ఇంకా చెప్పాలంటే బాలయ్య శ్రీనివాస ప్రసాద్ ను విజయశాంతికి పరిచయం చేశాడని కూడా అంటారు. వీరిద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉంటారు. ఇంట్లో కూడా చాలా ముద్దుగా పిలుచుకుంటూ ఉంటారట. శ్రీనివాస ప్రసాద్ విజయశాంతి ని చిన్ను అని పిలిస్తే… విజయశాంతి భర్తను నాన్న అని ఆప్యాయంగా పిలిచేవారు అట.
అలా ఒకరికొకరు ఎంతో ఆప్యాయంగా ఉంటారని విజయశాంతి (Vijaya Shanthi) జీవిత చరిత్ర రాసిన సీనియర్ సినీ విశ్లేషకులు ఈ మంది రామారావు ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ప్రస్తుతం విజయశాంతి తెలంగాణలో బిజెపిలో యాక్టివ్ గా కొనసాగుతున్న సంగతి తెలిసిందే.
ఆ హీరోయిన్ ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటుందో తెలిస్తే షాక్ అవుతారు..!
‘బ్రో’ ‘బలగం’ తో పాటు చావు కాన్సెప్ట్ తో రూపొందిన 10 సినిమాల లిస్ట్..
హైప్ లేకుండా రిలీజ్ అయిన 10 పెద్ద సినిమాలు… ఎన్ని హిట్టు… ఎన్ని ప్లాప్?