టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వారిలో మెగాస్టార్ చిరంజీవి ఒకరు. ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా నటనపై ఆసక్తితో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినటువంటి చిరంజీవి కెరియర్ మొదట్లో అవకాశాల కోసం ఎన్నో ప్రయత్నాలు చేశారు. అయితే ఈయన నటన టాలెంట్ చూసి దర్శకులు ఈయనకు అవకాశం కల్పించారు. కెరియర్ మొదట్లో పలు చిన్న చిన్న పాత్రలలో నటించిన చిరంజీవి అనంతరం హీరోగా అవకాశాలు అందుకున్నారు.
ఇలా హీరోగా అవకాశాలను అందిపుచ్చుకొని ఇండస్ట్రీలో అంచలంచలుగా ఎదుగుతూ నేడు మెగాస్టార్ అనే రేంజ్ కు వెళ్లారు. ఇలా సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి ఈ స్థాయిలో సక్సెస్ అందుకోవడంతో చిరంజీవిని స్ఫూర్తిగా తీసుకొని ఇండస్ట్రీలోకి ఎంతోమంది హీరోలు అడుగుపెట్టి సక్సెస్ అయిన సంగతి మనకు తెలిసిందే.
ఇలా స్టార్ హీరోగా ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలుగుతున్నటువంటి చిరంజీవి ప్రస్తుతం 68 సంవత్సరాల వయసు కలిగి ఉన్నారు. ఈ వయసులో కూడా ఈయన యంగ్ హీరోలకు ఏమాత్రం తీసిపోకుండా అలాగే అవకాశాలను అందుకుంటు అదే ఫిట్నెస్ మైంటైన్ చేస్తూ సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఈ వయసులో కూడా చిరంజీవి (Chiranjeevi) ఇంత ఫిట్ గా ఉండడానికి సీక్రెట్ ఏంటి అని అందరూ కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తుంటారు.
ఇక చిరంజీవి ఈ వయసులో కూడా ఇలా ఫిట్ గా ఉండడానికి కారణం లేకపోలేదు. ఈయన ఈ వయసులో కూడా పెద్ద ఎత్తున వర్కౌట్ చేస్తూ కష్టపడుతూ ఉంటారు. ప్రతిరోజు దాదాపు 5 గంటల పాటు చిరంజీవి జిమ్ లోనే గడుపుతూ ఉంటారని తెలుస్తోంది. ఇలా భారీ స్థాయిలో వర్కౌట్స్ చేయడమే ఈయన ఫిట్నెస్ సీక్రెట్ అని తెలుస్తోంది.