Rashmika: రష్మిక ఎన్ని బాషలు మాట్లాడగలదో తెలిస్తే షాక్ అవుతారు!

నేషనల్ క్రష్ రష్మిక మందన్నా అమ్మడి అందచందాలకు దేశ వ్యాప్తంగా కుర్రకారు ఫిదా అయిపోయారు. ‘ఛ‌లో’ సినిమాతో తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమై కు ‘గీతా గోవిందం’తో ఫ్యాన్స్ గుండెల్లో గూడు కట్టేసుకుంది. వాస్తవానికి కన్నడ భామ అయినా ఏ ఇండస్ట్రీకి వెళితే అక్కడ మా రష్మిక అనిపించుకుంది. అల్లు అర్జున్ సరసన ‘పుష్ప’ చిత్రంతో నేష‌న‌ల్ క్ర‌ష్‌ అయిపోయింది. ప్రస్తుతం తెలుగులోనే కాకుండా క‌న్న‌డ‌, హిందీ, త‌మిళ భాష‌ల్లో నటిస్తూ కాల్షీట్స్ ఖాళీనే లేకుండా ఫుల్ బిజీ అయిపోయింది.

అటు సినిమాలు ఇటు యాడ్స్ చేస్తూ రెండు చేతులా సంపాదిస్తోంది. సోషల్ మీడియాలో రష్మికకు దాదాపు 38 మిలియ‌న్లకు పైగా ఫాలోవ‌ర్స్ ఉన్నారు. సినిమాల‌కు సంబంధించిన విష‌యాలతో పాటు తన వ్యక్తిగత విషయాలను ఎప్పటికప్పుడు తన అభిమానులతో షేర్ చేసుకుంటుంది. తాజాగా ర‌ష్మిక అభిమానుల‌తో ఆస్క్ మీ సెషన్ నిర్వహించింది. అందులో అభిమానులు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు ఓపికగా సమాధానాలు అందించింది. నెటిజన్స్ రష్మికకు ఇష్ట‌మైన ప్ర‌దేశం గురించి అడిగారు. దీంతో ఆమె క‌ర్ణాట‌కలోని కూర్గులో ఉన్న తన ఇల్లంటే ఎంతో ఇష్టమని చెప్పింది.

అంతేకాకుండా తాను ఏకంగా ఆరు బాష‌ల్లో మాట్లాడ‌గ‌ల‌నన్న సీక్రెట్ రివీల్ చేసింది. హైద‌రాబాద్ వాసులతో మాట్లాడేట‌ప్పుడు ‘న‌మ‌స్తే బాగున్నారా’ అంటూ ప‌ల‌క‌రిస్తాన‌ని చెప్పింది. అంతేకాదండోయ్ త‌మిళ‌, క‌న్న‌డ‌, తెలుగు భాష‌ల్లో మాట్లాడి అంద‌రిని సంతోష పరిచింది. తనకు కొరియ‌న్ ఫ్రైడ్ చికెన్ అంటే త‌న‌కు చాలా ఇష్టమని పేర్కొంది. ప్ర‌స్తుతం ర‌ష్మిక చేతితో మూడు భారీ ప్రాజెక్టులున్నాయి. వీటిలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ స‌ర‌స‌న ‘పుష్ప 2’ ఒకటి. తనకు నేషనల్ క్రష్ బిరుదు అందించిన ‘పుష్ప’కు సీక్వెల్‌గా ఈ చిత్రం రూపొందుతుంది.

సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా కోసం ప్రేక్ష‌కులు చాలా ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇదే కాకుండా హిందీలో ర‌ణ్‌బీర్ క‌పూర్ తో కలిసి ‘యానిమ‌ల్’ చిత్రంలో న‌టిస్తోంది. దీనికి అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ వంగా ద‌ర్శ‌క‌త్వం వహిస్తున్నాడు. మరో లేడీ ఓరియెంటెడ్ మూవీ ‘రెయిన్ బో’ చిత్రంలోనూ నటిస్తోంది (Rashmika) రష్మిక.

‘జవాన్’ ట్రైలర్ పై ట్రెండ్ అవుతున్న 15 మీమ్స్!

ఇప్పటికీ రిలీజ్ కి నోచుకోని 10 క్రేజీ సినిమాల లిస్ట్..!
ఈ వీకెండ్ కి ధియేటర్/ఓటీటీలో రిలీజ్ కాబోతున్న 15 సినిమాలు/ సిరీస్ ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus