నందమూరి తారకరత్న.. కెరీర్ ఎంతో వైభవంగా స్టార్ట్ అయ్యింది. రాఘవేంద్ర రావు, కోదండరామిరెడ్డి వంటి గోల్డెన్ హ్యాండ్స్ చేతిలో అతను పడ్డాడు. అతను హీరోగా ఎంట్రీ ఇస్తూనే ఒకే రోజు 9 సినిమాలను సెట్స్ పైకి తీసుకెళ్లాడు. ఇది అప్పట్లో ఓ రికార్డ్.. ఇప్పటికీ ఎవ్వరూ బ్రేక్ చేయని… చేయలేని ఓ రికార్డే. అయితే తారకరత్న హీరోగా చేసిన సినిమాలు ఒక్కటి కూడా హిట్ అవ్వలేదు. అతను 21 సినిమాలు చేస్తే ఒక్కటి కూడా హిట్ అవ్వలేదు.
రెండు, మూడు యావరేజ్ లు పడ్డాయి. పెద్ద ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఉన్నా, పెద్ద సంస్థలు, దర్శకులతో సినిమాలు చేసినా అతనికి హిట్లు లేకపోవడంతో తారకరత్నకు అదృష్టం లేదు అని అంతా అనుకుంటున్నారు. అయితే ఇతను అదృష్టవంతుడే… ఇప్పటికీ చెప్పుకోవచ్చు ఇతను అదృష్టవంతుడే అని..! ఎలా అంటారా.. అక్కడికే వస్తున్నా..! ఇటీవల తారకరత్నకు గుండెపోటు వచ్చింది. నారా లోకేష్ తలపెట్టిన యువగళం పాదయాత్రలో తారకరత్న కూడా పాల్గొన్నాడు. ఆ సమయంలో అతనికి తీవ్ర గుండెపోటు వచ్చింది.
దీంతో అతన్ని కుప్పంలో ఉన్న ఓ హాస్పిటల్ లో జాయిన్ చేశారు. కానీ పరిస్థితి చేయి దాటిపోయింది అని భావించి బెంగళూరులోని నారాయణ హృదయాలయ హాస్పిటల్ లో జాయిన్ చేశారు. వారం రోజులు గడుస్తున్నా అతను ఇంకా స్పృహలోకి రాలేదు కానీ పెద్ద ప్రమాదమైతే తప్పిందని డాక్టర్లు చెప్పారు. నారాయణ హృదయాలయ హాస్పిటల్ లో తారకరత్న చాలా కాస్ట్లీ ట్రీట్మెంట్ ఇస్తున్నారు. ఇప్పటివరకు రూ.80 లక్షల పైనే ఖర్చు అయినట్టు వినికిడి.
ఈ మొత్తాన్ని నారా చంద్రబాబు నాయుడు, లోకేష్ లు పెట్టుకుంటున్నారట. ఎందుకంటే నందమూరి ఫ్యామిలీ హీరోల్లో ఆర్ధికంగా వెనుకబడింది తారకరత్న ఒక్కడే. అతను తన ఆస్తిలో కొంత మట్టుకు పోగొట్టుకున్నాడు కూడా..! అందుకే నారా ఫ్యామిలీ తారకరత్నకు అలాగే అతని భార్య పిల్లలకు అండగా నిలబడ్డారు అని తెలుస్తుంది. ఇప్పుడు చెప్పండి ఇలాంటి పరిస్థితిలో వేరే వారు ఎవరైనా బ్రతికి గట్టెక్కగలరా. కేవలం అతను నందమూరి వారసుడు కాబట్టి బ్రతకగలుగుతున్నాడు. మరి అతను అదృష్టవంతుడే కదా..!