పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి మనకి కొత్తగా తెలియాల్సిన విషయాలు ఏమి లేవు. మెగాస్టార్ చిరంజీవి సోదరుడిగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ఆయన తన సొంత దారిలోనే వెళ్తూ కేవలం రెండు మూడు సినిమాలతోనే తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్కుని ఏర్పాటు చేసుకున్నాడు. కెరీర్ ప్రారంభం మొత్తం యూత్ ని అలరించే సినిమాలే ఎక్కువగా చేసి, యూత్ ఐకాన్ గా మారిపోయాడు. ‘ఖుషి’ సినిమాతో ఇండస్ట్రీ రికార్డ్స్ మొత్తాన్ని బద్దలు కొట్టి తన అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి నెంబర్ 1 సీటుకే ఎసరు పెట్టాడు.
ఆ తర్వాత హిట్టు ఫ్లాప్ తో సంబంధం లేకుండా (Pawan Kalyan) పవన్ కళ్యాణ్ కి క్రేజ్ పెరుగుతూనే ఉంది. రీ ఎంట్రీ తర్వాత పవన్ కళ్యాణ్ చేసిన మూడు సినిమాల్లో రెండు సినిమాలు భారీ బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిల్చిన సంగతి తెలిసిందే. ఇకపోతే పవన్ కళ్యాణ్ గురించి ఎవరికీ తెలియని ఒక పాత నిజం చాలా కాలం తర్వాత బయటపడింది. అదేమిటంటే పవన్ కళ్యాణ్ ఫిలిం ఇన్స్టిట్యూట్ లో ట్రైనింగ్ అవుతున్న రోజుల్లో ఒక షార్ట్ ఫిలిం చేసాడు.
ఈ షార్ట్ ఫిలిం కళ్ళు కోల్పోయిన చిన్నారుల గురించి ఉంటుంది . అప్పట్లో ట్విట్టర్, ఫేస్ బుక్ , ఇంస్టాగ్రామ్ వంటి పెద్ద పెద్ద యాప్స్ ఏమి ఉండేవి కాదు. కేవలం ఆర్కుట్ మాత్రమే ఉండేది. ఆర్కుట్ లో పవన్ కళ్యాణ్ కమ్యూనిటీ ఆసియా ఖండం లోనే అత్యంత పెద్దది, రెండవ స్థానం లో కొనసాగేది. ఈ షార్ట్ ఫిలిం ఆర్కుట్ లో అప్పట్లో ఒక రేంజ్ లో వైరల్ అయ్యింది. ఇప్పుడు ఈ వీడియో చూడాలంటే అందులో లాగిన్ అయ్యి చూడాలి .
కానీ ఆర్కుట్ 2014 వ సంవత్సరం లోనే మూతపడింది.అందువల్ల ఈ వీడియో దొరకడం ఇప్పుడు కష్టమైంది. అయితే ఈ వీడియో మెగా బ్రదర్ నాగబాబు వద్ద అందుబాటులో ఉందంట, పవన్ కళ్యాణ్ పుట్టినరోజు నాడు, అనగా సెప్టెంబర్ 2 వ తేదీ ఈ షార్ట్ ఫిలిం ని నాగబాబు తన అధికారిక యూట్యూబ్ ఛానల్ లో విడుదల చేయబోతున్నాడని టాక్. మరి ఈ షార్ట్ ఫిలిం యూట్యూబ్ లో ఎన్ని రికార్డ్స్ ని నెలకొల్పబోతుందో చూడాలి.
మిడ్ రేంజ్ హీరోలు చేసిన ఈ 10 యాక్షన్ సినిమాలు భారీ నష్టాలు మిగిల్చాయని మీకు తెలుసా?
మెహర్ రమేష్ తో పాటు పెద్ద హీరోలు ఛాన్సులు ఇచ్చినా హిట్లివ్వలేకపోయిన డైరెక్టర్ల లిస్ట్.!
రామ్ నీ బాలయ్య ఏమని తిట్టాడో తెలిస్తే షాక్ అవుతారు..!