Shah Rukh Khan: సెల్ ఫోన్ నంబర్ నుంచి కార్ల వరకు ఈ నెంబర్ ఉండాల్సిందేనా?

బాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి నటుడు షారుక్ ఖాన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తాజాగా ఈయన జవాన్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమాతో భారీ స్థాయిలో కలెక్షన్లను అందుకుంటు ఎంతో విజయవంతంగా దూసుకుపోతుంది.ఇలా ఈ సినిమా ద్వారా షారుక్ స్టామినా ఏంటో మరోసారి నిరూపించారు పటాన్ సినిమాతో దాదాపు 1,000 కోట్లకు పైగా కలెక్షన్లను సాధించినటువంటి షారుక్ వెంటనే జవాన్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మరో బ్లాక్ బాస్టర్ అందుకున్నారు.

కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో నయనతార షారుఖ్ ఖాన్ జంటగా నటించిన ఈ సినిమా అన్ని భాషలలోనూ ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమాపై ఎంతోమంది సినీ సెలెబ్రిటీలు కూడా ప్రశంశల వర్షం కురిపించారు. ఇదిలా ఉండగా తాజాగా షారుఖ్ ఖాన్ గురించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అందరూ హీరోల మాదిరిగానే ఈయనకు కూడా కొన్ని సెంటిమెంట్లో ఉన్నాయని ఆ సెంటిమెంట్లను షారుక్ తప్పకుండా ఫాలో అవుతారని తెలుస్తుంది.

షారుక్ ఖాన్ (Shah Rukh Khan) సినిమాలో పరంగా కాకపోయినా ఆయన ఏదైనా ఒక వస్తువును కొనుగోలు చేసిన లేదా ఒక కారును కొనుగోలు చేసిన అందులో తప్పనిసరిగా ఒక నెంబర్ ఉండాలని భావిస్తారట ఇలా షారుఖ్ ఖాన్ సైతం నెంబర్ సెంటిమెంటును పాటిస్తారని తెలుస్తోంది. మరి షారుక్ ఖాన్ సెంటిమెంట్ నెంబర్ ఏంటి అనే విషయానికి వస్తే…555 ఇదే షారుఖ్ ఖాన్ నెంబర్ సెంటిమెంట్ అని చెప్పాలి.

ఈయన మొబైల్ నెంబర్ నుంచి మొదలుకొని తను కొనుగోలు చేసే కార్ల వరకు కూడా ఇదే నెంబర్ ఉండేలాగా జాగ్రత్తలు తీసుకుంటారట ఈ నెంబర్ తనకు చాలా అదృష్టం తీసుకువచ్చిందని అందుకే ఈ నెంబర్ తన కార్ల విషయంలోనూ మొబైల్ నెంబర్ విషయంలోనూ ఉండేలాగే షారుఖ్ ఖాన్ జాగ్రత్త పడతారని తెలుస్తోంది. అయితే షారుక్ ఖాన్ కుటుంబ సభ్యులకు కూడా ఈయన నంబర్ సెంటిమెంటును అనుసరిస్తారని తెలుస్తోంది.

జవాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 7’ 14 మంది కంటెస్టెంట్స్ పారితోషికాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus