25, 50, 100 ఇవి చూడటానికి చెప్పుకోడానికి రౌండ్ ఫిగర్ నంబర్సే.. కానీ కొందరి లైఫ్ లో చాలా ముఖ్యమైన నంబర్స్ గా చెప్పుకుంటారు. క్రికెట్లో కావచ్చు వేరే ఏదైనా స్పోర్ట్స్ లో కావచ్చు. సినిమా వాళ్ళకి కి కూడా ఓ ప్రత్యేకమైన నెంబర్. ముఖ్యంగా హీరోలకి ఇది ఓ ల్యాండ్ మార్క్ నెంబర్ లాంటిది. ప్రస్తుతం మనం 25 గురించి చెప్పుకుందాం. ఈరోజుల్లో హీరోలు 25 సినిమాలు చేయడం అంటే చాలా కష్టమైన పని. మరీ ముఖ్యంగా 25 వ సినిమా అంటే ల్యాండ్ మార్క్ మూవీ. దానికి రీచ్ అవ్వడమే చాలా కష్టమైన పని. మరి అలాంటి ల్యాండ్ మార్క్ మూవీస్ తో కొంతమంది స్టార్స్ ఎలాంటి ఫలితాలను అందుకున్నారో తెలుసుకోవాలని అందరికీ ఉంటుంది. ఇప్పుడు దానిపై ఓ లుక్కేద్దాం రండి :
1) పవన్ కళ్యాణ్ :
త్రివిక్రమ్ – పవన్ కాంబినేషన్ కి ఓ సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. ‘జల్సా’ వంటి హిట్, ‘అత్తారింటికి దారేది’ వంటి ఇండస్ట్రీ హిట్.. ఈ కాంబినేషన్లో వచ్చాయి. అందుకే ‘అజ్ఞాతవాసి’ చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అందులోనూ ఇది పవన్ కళ్యాణ్ కి 25వ సినిమా. కానీ అంచనాలను మ్యాచ్ చేయడంలో పూర్తిగా విఫలమైంది ఈ మూవీ.
2) ఎన్టీఆర్ :
ఎన్టీఆర్ 25వ సినిమాగా ‘నాన్నకు ప్రేమతో’ సినిమా వచ్చింది. సుకుమార్ డైరెక్షన్లో వచ్చిన టిపికల్ సస్పెన్స్ అండ్ ఎమోషనల్ డ్రామా ఇది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద యావరేజ్ ఫలితాన్ని అందుకుంది. అయితే ఎన్టీఆర్ ని మొదటి రూ.50 కోట్ల షేర్ క్లబ్ లోకి చేర్చింది ఈ మూవీ.
3) మహేష్ బాబు :
మహేష్ బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందిన మూవీ ఇది. మహేష్ బాబుకి ఇది 25వ సినిమా. మొదట మిక్స్డ్ టాక్ ను మూటగట్టుకున్న ఈ సినిమా.. తర్వాత పికప్ అయ్యి బాక్సాఫీస్ వద్ద హిట్ స్టేటస్ ను దక్కించుకుంది. అలాగే ‘హోల్ సమ్ ఎంటర్టైనర్’ కేటగిరిలో నేషనల్ అవార్డుని అలాగే, పాలపిట్ట పాటకు మరో నేషనల్ అవార్డుని అందుకుంది ఈ మూవీ.
4) సూర్య :
సూర్య హీరోగా హరి దర్శకత్వంలో వచ్చిన సినిమా ఇది. సూర్యకి ఇది 25వ సినిమా. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది.
5) రవితేజ :
మాస్ మహారాజ్ హీరోగా చేసిన 25వ సినిమా ‘కిక్’. సురేందర్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకుడు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయ్యింది.రూ.10 కోట్లు ఉండే రవితేజ మార్కెట్ ని రూ.25 కోట్లకు పెంచింది ఈ మూవీ.
6) నాని :
నాని హీరోగా ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో రూపొందిన మూవీ ఇది. నాని కెరీర్లో ఇది 25వ సినిమా. సుధీర్ బాబు కూడా ఇందులో మరో హీరోగా నటించాడు. అయితే ఈ సినిమా కోవిడ్ లాక్ డౌన్ టైంలో నేరుగా ఓటీటీలో రిలీజ్ అయ్యింది.
7) నితిన్ :
నితిన్ హీరోగా కృష్ణ చైతన్య దర్శకత్వంలో వచ్చిన సినిమా ఇది. పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. త్రివిక్రమ్ ఈ చిత్రానికి డైలాగులు కూడా రాయడం జరిగింది. నితిన్ కి ఇది 25వ సినిమా. కానీ బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు.
8) గోపీచంద్ :
గోపీచంద్ హీరోగా కె.చక్రవర్తి రెడ్డి దర్శకత్వంలో రూపొందిన మూవీ ఇది. గోపీచంద్ కెరీర్లో ఇది 25వ సినిమా. బాక్సాఫీస్ వద్ద ఈ మూవీకి యావరేజ్ గా పెర్ఫార్మ్ చేసింది.
9) విక్రమ్ :
తెలుగులో ఎన్నో సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేసిన విక్రమ్.. తమిళంలో స్టార్ హీరోగా ఎదిగాడు. అతను నటించిన 25వ సినిమా ‘సేతు’.బాల దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా తమిళంలో సూపర్ హిట్ అయ్యింది.ఇదే చిత్రాన్ని తెలుగులో రాజశేఖర్ హీరోగా ‘శేషు’ పేరుతో రీమేక్ అవ్వగా.. ఇక్కడ మాత్రం ప్లాప్ అయ్యింది.
10) జపాన్ :
కార్తీ హీరోగా రాజు మురుగన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా.. కార్తీ 25వ సినిమాగా రూపొందింది. నవంబర్ 10న దీపావళి కానుకగా రిలీజ్ అయిన ఈ సినిమా మొదటి షోతోనే ప్లాప్ టాక్ ను మూటగట్టుకుంది.