లావణ్య త్రిపాటి త్వరలోనే మెగా ఇంటి కోడలుగా అడుగు పెట్టబోతున్న సంగతి మనకు తెలిసిందే. ఈమె మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రేమలో ఉంటూ వీరీ ప్రేమ విషయాన్ని తెలియజేయకుండా రహస్యంగా ప్రేమ ప్రయాణం కొనసాగించారు అయితే వీరి ప్రేమ విషయాన్ని బయట పెట్టి పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకోవడానికి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ఎంతో ఘనంగా నిశ్చితార్థం జరుపుకున్నటువంటి ఈ జంట త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. ఇక నవంబర్ మొదటి వారంలోనూ లేదా అక్టోబర్ చివరి వారంలో వీరి వివాహం జరగబోతుందని వార్తలు వినపడుతున్నప్పటికీ ఇంకా అధికారిక ప్రకటన వెలబడలేదు.
వీరి పెళ్లి కానున్న నేపథ్యంలో చిరంజీవి మెగా కుటుంబ సభ్యులందరికీ ఘనంగా పార్టీ ఇచ్చిన సంగతి మనకు తెలిసిందే. ఇలా వీరి ప్రీ వెడ్డింగ్ వేడుకలకు సంబంధించిన ఫోటోలను చిరంజీవి సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. అయితే వేడుకలో లావణ్య త్రిపాటి చాలా స్టైలిష్ లుక్ లో కనిపించారు. యెల్లో కలర్ చుడీదార్ లో ఈమె చాలా స్పెషల్ అట్రాక్షన్ గా కనిపించారు. ఇక ఈ వేడుకలో భాగంగా లావణ్య (Lavanya Tripathi) చేతిలో ఒక హ్యాండ్ బ్యాగ్ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది.
ప్రస్తుతం ఈ హ్యాండ్ బ్యాగ్ గురించి ఒక వార్త వైరల్ గా మారింది. ఈ హ్యాండ్ బాగ్ తనకు నిహారిక కానుకగా ఇచ్చారని తెలుస్తుంది. ఇలా తనకు కాబోయే వదినకు ప్రేమతో ఈ హ్యాండ్ బ్యాగ్ తనకు ఇచ్చారట. ఇలా లావణ్య చేతిలో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచినటువంటి ఈ హ్యాండ్ బ్యాగ్ అందరి దృష్టిని ఆకర్షించింది. దీంతో ఈ హ్యాండ్ బ్యాగ్ ఖరీదు ఎంత అని ఆరా తీయగా అందరూ దీని ధర తెలిసి షాక్ అవుతున్నారు. ఈ హ్యాండ్ బ్యాగ్ ఖరీదు 1.5 లక్షల రూపాయలు అని తెలియడంతో అందరూ షాక్ అవుతున్నారు.