Puri Jagannadh: ఆ సినిమా తీసినందుకు పూరి జగన్నాథ్ ఇప్పటికీ బాధపడతాడట..!

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ సినిమాలకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఆయన సినిమాలు వరుసగా 10 ఫ్లాపైనా.. 11వ సినిమాకి కూడా మంచి ఓపెనింగ్స్ వస్తాయి. ఎందుకంటే పూరి అంత టాలెంటెడ్. ఆయన పై అతని అభిమానులకు ఉన్న నమ్మకం.ఆయన సినిమాల్లో సుత్తి కొట్టని ఫిలాసఫీ ఉంటుంది. హీరోయిజం పచ్చిగా ఉంటుంది. అందుకే పూరి సినిమాలు అంటే అభిమానులకు అంత ఇష్టం.ముఖ్యంగా యూత్ కు..! ఇటీవల పూరి నుండి వచ్చిన ‘లైగర్’ మూవీ అంతగా ఆడకపోయినా పూరి జగన్నాథ్ ఇమేజ్ కు ఏమాత్రం దెబ్బ పడలేదు.

ఇలాంటి ప్లాపులు పూరి ఎన్నో చూసి వచ్చిన వాడే. ఈ సినిమా కాకపోతే ఇంకో సినిమాతో హిట్టు కొట్టడం ఆయనకు అలవాటే..! అయితే పూరి జగన్నాథ్ తీసిన సినిమాల్లో.. అభిమానులకు ఎలా ఉన్నా పూరికే నచ్చని సినిమా ఒకటి ఉంది. అది ఏంటో తెలుసా? ఆ సినిమా మరేదో కాదు ‘ఆంధ్రావాలా’. ఎన్టీఆర్ తో పూరి చేసిన మొదటి సినిమా ఇది. 2004 జనవరి 1న ఈ మూవీ రిలీజ్ అయ్యింది. ‘సింహాద్రి’ తర్వాత ఎన్టీఆర్ నుండి వచ్చిన ఈ మూవీ భారీ అంచనాల నడుమ రిలీజ్ అయ్యింది.

కానీ ఘోరంగా ప్లాప్ అయ్యింది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ ప్లే చేశాడు. ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే పాత్ర అభిమానులను తీవ్రంగా నిరాశపరిచింది. నిజానికి అభిమానులు ఆ పాత్రను చూసి బాగా ఇరిటేట్ అయిపోయారు. ఇలా ఈ సినిమా ప్లాప్ అవ్వడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. ఇదిలా ఉంచితే..

పూరి తీసిన సినిమాల్లో తనకు ‘ఆంధ్రావాలా’ అంటే అస్సలు నచ్చదని ఓ సందర్భంలో చెప్పాడు. ఇలాంటి సినిమా ఎన్టీఆర్ తో తీసి అతనికి ప్లాప్ ఇచ్చినందుకు చాలా బాధ పడినట్లు కూడా పూరి తెలిపాడు. ఆ గిల్టీ తోనే ఎన్టీఆర్ కు కచ్చితంగా ఓ హిట్ ఇవ్వాలి అనే కోరిక పెరిగిందని.. అది ‘టెంపర్’ తో నెరవేరినందుకు ఆనందంగా ఉందని గతంలో పూరి చెప్పుకొచ్చాడు.

రంగ రంగ వైభవంగా సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘రంగ రంగ వైభవంగా’ కి డిజాస్టర్ టాక్ రావడానికి గల 10 కారణాలు..!
పవన్ కళ్యాణ్ తో నటించిన ఈ 11 మంది హీరోయిన్లకు కలిసి రాలేదట..!
8నెలల వయసులోనే సినిమాల్లోకి ఎంట్రీ.. అక్కినేని నాగార్జున గురించి 10 ఆసక్తికర

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus