తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకొని అంతర్జాతీయ స్థాయిలో మంచి ఆదరణ పొందినటువంటి డైరెక్టర్ ఎస్.ఎస్.రాజమౌళి గురించి అందరికీ ఎంతో సుపరిచితమే. సీరియల్ డైరెక్టర్ గా మొదలు పెట్టినటువంటి తన ప్రయాణం అంతర్జాతీయ స్థాయికి గొప్ప దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఈయన సినిమా చేసే విధానం ఈయన దర్శకత్వ ప్రతిభ చూసి హాలీవుడ్ డైరెక్టర్లు కూడా ఆశ్చర్యపోతున్నారు. రాజమౌళి సినిమాలో పనిచేయడానికి హాలీవుడ్ టెక్నీషియన్ కు కూడా ముందుకు రావడం విశేషం.
ఇలా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న రాజమౌళి ఇప్పటివరకు 12 సినిమాలకు దర్శకత్వం వహించారు. ఏ సినిమా కూడా రాజమౌళికి నష్టాలను తీసుకురాలేదు. ఈయన దర్శకత్వం వహించిన సినిమాలన్నీ కూడా మంచి సక్సెస్ అవ్వడమే కాకుండా నిర్మాతలకు మంచి లాభాలను తీసుకువచ్చాయి. ఇక రాజమౌళి ఇప్పటివరకు 12 సినిమాలను చేశారు అనే విషయం తెలిసినప్పటికీ ఈయన కెరియర్ లో కూడా ఓ సినిమా మధ్యలో వరకు షూటింగ్ జరుపుకొని ఆ సినిమా షూటింగ్ పూర్తి కాక విడుదలకు నోచుకోలేక పోయిందని తెలుస్తుంది.
మరి ఈయన కెరియర్ లో ఆగిపోయిన సినిమా ఏంటి అనే విషయానికి వస్తే… (Rajamouli) రాజమౌళి స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా తర్వాత దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు కొడుకు సూర్య ప్రకాష్ తో కలిసి ఒక సినిమాకు కమిట్ అయ్యారట. ఈ విధంగా ఈ సినిమా షూటింగ్ పనులు జరుగుతూ ఉండగా మధ్యలోనే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కారణంగా ఈ సినిమా షూటింగ్ ఆపివేసారని తెలుస్తుంది.
అంతేకాకుండా అప్పటికే సూర్య ప్రకాష్ నటించిన సినిమాలో కూడా ఫ్లాప్ కావడంతో నిర్మాతలకు కూడా ఈ సినిమాని చేయటానికి ముందుకు రాలేదు. దీంతో ఈ సినిమా షూటింగ్ మధ్యలోనే ఆగిపోయింది. ఇక ప్రస్తుతం ఈయన సినిమాల విషయానికి వస్తే త్వరలోనే మహేష్ బాబుతో మరో సినిమా పనులలో బిజీ కాబోతున్నారు.
మహేష్, చరణ్..లతో పాటు ఈ ఏడాది ఒక్క సినిమాతో కూడా ప్రేక్షకుల ముందుకు రాని హీరోల లిస్ట్
‘హాయ్ నాన్న’ నుండి ఆకట్టుకునే 18 డైలాగులు ఇవే..!
‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ నుండి ఆకట్టుకునే 20 డైలాగులు ఇవే..!