Arunachalam: ‘అరుణాచలం’ బామ్మ తెలుగులో చేసిన సినిమాలు ఏవంటే..?

  • March 25, 2023 / 04:23 PM IST

(Arunachalam) పాత సినిమాలు, వాటిలో నటించిన పాపులర్ నటీనటుల గురించిన వార్తలు ఎప్పుడూ కూడా ప్రేక్షకాభిమానులకు, మూవీ లవర్స్‌కి ఆసక్తిగా అనిపిస్తుంటాయి.. సూపర్ స్టార్ రజినీ కాంత్ హీరోగా నటించిన సూపర్ హిట్ సినిమాలలో ‘అరుణాచలం’ ఒకటి.. ఇందులో ఆయన తండ్రీకొడుకులుగా ద్విపాత్రాభినయం చేశారు.. నటి ఖుష్బు భర్త సుందర్.సి దర్శకుడు.. రంభ, సౌందర్య హీరోయిన్లుగా కనిపించిన ఈ మూవీలో రజినీ బామ్మ పాత్రలో ఆకట్టుకున్నారు సీనియర్ నటి వడివుక్కరసి.. నెగెటివ్ క్యారెక్టర్, చూపులతోనే భయపెడుతూ..

డిఫరెంట్ గెటప్, వయసు మళ్లిన మహిళగా నడుం ఒంగిపోయి, కర్ర సాయంతో నడుస్తూ.. తల ఊపుతూ.. గంభీరంగా కనిపించిన వడివుక్కరసి నటనను అంత త్వరగా మర్చిపోలేం.. కథను కీలక మలుపుతిప్పే పాత్ర ఆమెది.. విశేషం ఏంటంటే అప్పటికి ఆమె వయసు 30 కూడా క్రాస్ కాలేదు.. రజినీ కాంత్ కంటే కూడా వయసులో 8 సంవత్సరాలు చిన్న.. అలాంటిది ఆయనకు బామ్మగా నటించి మెప్పించారు.. 1958 జూలై 6న చెన్నైలో జన్మించారామె..

తమిళంలో 350కి పైగా చిత్రాలు చేసి.. సహాయ నటిగా స్టార్ స్టేటస్ అందుకున్నారు.. దాదాపుగా అందరు సీనియర్, స్టార్ మరియు యంగ్ హీరోలతోనూ నటించారు.. అలాగే పలు డబ్బింగ్ సినిమాలతోనూ వడివుక్కరసి తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే.. తన వయసుకి మించిన వృద్ధ పాత్రల్లో ఎక్కువగా కనిపించారు.. అలాగే ప్రతినాయ పాత్రలలోనూ అదరగొట్టేశారు.. ‘అరుణాచలం’ లో ఆమె తన సీన్లన్నిటినీ దాదాపు సింగిల్ టేక్‌లోనే కంప్లీట్ చేసేవారట..

ఇక తెలుగులోనూ పలు డైరెక్ట్ ఫిలింస్ చేసి మెప్పించారు.. నాగార్జున ‘నేటి సిద్ధార్థ’, ‘అమ్మోరు’, విజయశాంతి ‘వైజయంతి’, ‘అశోక్’, ‘అందాలరాముడు’, ‘గుండమ్మ గారి మనవడు’, ‘పోరంబోకు’ వంటి మూవీస్ చేశారు.. ‘వైజయంతి’ లో ప్రతినాయకురాలిగా పవర్ ఫుల్ పాత్రలో కనిపించి ప్రేక్షకులను భయపెట్టేశారు.. పలు మలయాళం చిత్రాలతో పాటు ఒక కన్నడ సినిమా.. తమిళంలో 40 సీరియల్స్, అలాగే డబ్బింగ్ ఆర్టిస్టుగానూ తన ప్రతిభ చాటుకున్నారు వడివుక్కరసి.. కొద్దికాలంగా అడపాదడపా చిత్రాలు చేస్తున్నారామె..

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus