కట్టప్ప పాత్ర కోసం మొదటగా సంప్రదించిన హీరో ఎవరో తెలుసా ?
- May 18, 2017 / 06:41 AM ISTByFilmy Focus
బాహుబలి ఐదేళ్ల పాటు షూటింగ్ జరుపుకున్నప్పటికీ తెలియని కొన్ని నిజాలు ఇప్పుడు బయటపడుతున్నాయి. బాహుబలిలో పవర్ ఫుల్ రోల్ శివగామి కోసం రమ్యకృష్ణ కంటే ముందు శ్రీదేవిని సంప్రదించారన్న సంగతి మొదట బయటికి వచ్చింది. ఇప్పుడు కట్టప్ప పాత్ర కోసం సత్యరాజ్ కంటే ముందు మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ని రాజమౌళి కలిసారని తెలిసింది. కథ, పాత్ర నచ్చినప్పటికీ ఎక్కువరోజులు షూటింగ్ జరుగుతుందని ఆ పాత్ర చేయనన్నారని ఫిలిం నగర్ వాసులు చెప్పుకుంటున్నారు.
ఈ విషయాలు చూస్తుంటే బాహుబలి సినిమాలో అన్ని పరిశ్రమల నటీనటులను నటింపజేయించాలని దర్శకధీరుడు ప్రయత్నించినట్టు తెలుస్తోంది. కట్టప్ప పాత్రని మోహన్ లాల్ వద్దనే సరికి ఆ పాత్ర తమిళ సీనియర్ హీరో సత్యరాజ్ కి వెళ్ళింది. అయన అందులో జీవించి ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకున్నారు. ప్రభాస్, రానా తర్వాత గుర్తింపును సాధించారు. గత నెల 28 న రిలీజ్ అయిన ఈ మూవీ ఇరవై రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 1500 కోట్లు వసూలు చేసి ఔరా అనిపిస్తోంది.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.














