ప్రముఖ డాక్టర్లలో ఒకరైన గురువారెడ్డి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సోమవారం నుంచి శుక్రవారం వరకు పూర్తిస్థాయిలో ఆస్పత్రికి పరిమితమవుతానని రోజుకు 14 నుంచి 16 గంటల పాటు పని చేస్తానని తెలిపారు. శనివారం ఆస్పత్రి దరిదాపులకు కూడా వెళ్లనని డ్రైవర్ తో కలిసి సినిమా చూస్తానని సండే మాత్రం కుటుంబానికి సమయం కేటాయిస్తానని ఆయన అన్నారు. నాకు ఏ సంగీతం అయినా ఇష్టమేనని ఆయన తెలిపారు. కొన్ని పాటలు కళ్లు మూసుకుని వినాలని మరికొన్ని పాటలు చెవులు మూసుకొని వినాలని చెవులు మూసుకుని వినే పాటలు నాకు నచ్చవని ఆయన కామెంట్లు చేశారు.
దేవులపల్లి కృష్ణశాస్త్రి సాహిత్యం నాకు చాలా ఇష్టమని గురువారెడ్డి అన్నారు. ఏడాదికి కనీసం 3,4 కాన్ఫరెన్స్ లకు నేను వెళతానని ఆయన చెప్పుకొచ్చారు. కొన్ని కాన్ఫరెన్స్ లకు ఫ్యాకల్టీగా వెళతానని ఆయన కామెంట్లు చేశారు.గుణ్ణం గంగరాజు మా తోడ ల్లుడు అని ఆయన తీసిన అమృతం సీరియల్ లో నేను ఒకటి రెండు చిన్న రోల్స్ లో కనిపించానని ఆయన తెలిపారు. కీరవాణి, రాజమౌళి, చంద్రశేఖర్ ఏలేటి నా బంధువులని ఆయన కామెంట్లు చేశారు.
చిరంజీవి, అల్లు అరవింద్, బ్రహ్మానందం నాకు బాగా క్లోజ్ అని ఆయన చెప్పుకొచ్చారు. డాక్టర్ అన్న తర్వాత ఎమోషన్స్ ఉండాలని ఆయన కామెంట్లు చేశారు. రాజమౌళి పేరు నంది అని నేను ఒరేయ్ అని పిలిస్తే తను నన్ను బావ అని పిలుస్తారని గురువారెడ్డి చెప్పుకొచ్చారు. నేను లండన్ నుంచి వచ్చినప్పటి నుంచి రాజమౌళి తెలుసని గురువారెడ్డి అన్నారు.
రాజమౌళి చాలా సింపుల్ గా ఉంటారని ఆయన తెలిపారు. నిండుకుండ తొణకదు అనేలా రాజమౌళి ఉంటారని జక్కన్న మంచి వ్యక్తి అని గురువారెడ్డి వెల్లడించారు. రాజమౌళి గుప్తదానాలు చేస్తారని వాటిని వెల్లడించరని ఆయన అన్నారు.
Most Recommended Video
ది ఘోస్ట్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కపుల్ కంటెస్టెంట్స్ రోహిత్ అండ్ మెరీనా గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ శ్రీహాన్ గురించి ఆసక్తికర విషయాలు..!