కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ హాస్పిటల్ లో చేరడంతో ఒక్కసారిగా తమిళనాడు లో టెన్షన్ వాతావరణం ఏర్పడింది. విక్రమ్ కు గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు హాస్పిటల్ లో చేర్పించినట్టు ఆ వార్తల సారాంశం.చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో ఆయనకి ట్రీట్మెంట్ జరిగింది. దీంతో విక్రమ్ అభిమానుల్లో ఆందోళన మొదలైంది. ఆయన హాస్పిటల్ లో చేరింది నిజమే, డాక్టర్లు ట్రీట్మెంట్ ఇచ్చింది నిజమే. కాకపోతే ఆయన హాస్పిటల్ లో చేరింది హార్ట్ ఎటాక్ కారణంగా కాదు..!
‘చాతి నొప్పి కారణంగా విక్రమ్ హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యారు.ఆయనకి ఎలాంటి గుండెపోటు రాలేదు. ఆయన ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉంది. త్వరలోనే ఆయన్ని హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ చేస్తాం’ అంటూ చెన్నైలోని కావేరి ఆస్పత్రి యాజమాన్యం విక్రమ్ హెల్త్ పై స్పందించి క్లారిటీ ఇచ్చింది. ఈరోజు ఉదయం విక్రమ్ ఎక్సర్సైజ్ చేసి రెస్ట్ తీసుకుంటున్న టైం లో ఆయనకి ఛాతిలో నొప్పి వచ్చినట్లు తెలుస్తుంది.విక్రమ్ కొన్నాళ్ళు ఎక్సర్సైజ్ వంటి వాటికి దూరంగా ఉండాలని కూడా డాక్టర్లు సూచించినట్టు తెలుస్తుంది.
‘విక్రమ్ ఇప్పుడు బాగానే ఉన్నారు’ అంటూ అతని కొడుకు ధృవ్ కూడా తన సోషల్ మీడియా ద్వారా తెలియజేశాడు. గతంలో పలు తెలుగు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించిన విక్రమ్.. అటు తర్వాత తమిళంలో హీరోగా నటిస్తూ వచ్చాడు. ఈ క్రమంలో ఆయన బాల దర్శకత్వంలో చేసిన ‘శివపుత్రుడు’ 2004 లో విడుదలయ్యి పెద్ద హిట్ అయ్యింది. ఈ చిత్రంలో విక్రమ్ నటనకు గాను నేషనల్ అవార్డు కూడా దక్కింది.
అటు తర్వాత 2005లో వచ్చిన ‘అపరిచితుడు’ చిత్రం విక్రమ్ ను స్టార్ హీరోని చేసింది.అయితే ఆ తర్వాత అతని నుండి వచ్చిన సినిమాలు పెద్దగా ఆడలేదు.శంకర్ దర్శకత్వంలో చేసిన ‘ఐ’ చిత్రం సైతం నిరాశపరిచింది. ఈ ఏడాది ఓటీటీలో రిలీజ్ అయిన ‘మహాన్’ చిత్రం కొంత వరకు పర్వాలేదు అనిపించింది. తాజాగా అతను కీలక పాత్ర పోషించిన ‘పొన్నియిన్ సెల్వన్-1’ టీజర్ రిలీజ్ అయ్యింది. అందులో విక్రమ్ చెప్పిన డైలాగ్ కూడా హైలెట్ గా నిలిచింది.
Most Recommended Video
టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇవ్వబోతున్న 10 మంది హీరోయిన్స్ లిస్ట్..!
అభిమానులకు అవకాశాలు ఇచ్చి బ్లాక్ బస్టర్లు అందుకున్న హీరోలు..!
ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అయిన 13 సినిమాల లిస్ట్..!