టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నారు. అదే సమయంలో పొలిటికల్ గా కూడా పవన్ కళ్యాణ్ యాక్టివ్ గా ఉంటూ వైసీపీ నేతలపై తనదైన శైలిలో విమర్శలు చేయడం ద్వారా వార్తల్లో నిలుస్తున్నారు. అయితే కోన వెంకట్ పవన్ కళ్యాణ్ గురించి ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను వెల్లడించగా ఆ విషయాలు సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతున్నాయి.
కోన వెంకట్ మాట్లాడుతూ రామోజీ ఫిల్మ్ సిటీలో తీన్ మార్ మూవీ షూట్ జరుగుతున్న సమయంలో పవన్ కళ్యాణ్ పిలిస్తే వెళ్లానని ఆ సమయంలో దబాంగ్ రీమేక్ కు ఏ డైరెక్టర్ అయితే బాగుంటుందని పవన్ మూడు పేర్లు చెప్పాడని కోన వెంకట్ అన్నారు. ఆ పేర్లలో ఒకపేరు హరీష్ శంకర్ అని ఆయన కామెంట్లు చేశారు. హరీష్ అయితే దబాంగ్ రీమేక్ కు న్యాయం చేయగలడని నేను అన్నానని కోన వెంకట్ పేర్కొన్నారు.
నీ శిష్యుడని హరీష్ పేరును సూచిస్తున్నావా అని పవన్ అడగగా దబాంగ్ రీమేక్ కు నూటికి నూరు శాతం న్యాయం చేసే వ్యక్తి హరీష్ మాత్రమేనని చెప్పానని కోన వెంకట్ వెల్లడించారు. హరీష్ మంచి ఫైర్ ఉన్న డైరెక్టర్ అని చెప్పానని కోన అన్నారు. ఆ తర్వాత పవన్ నా మనస్సులో కూడా అదే ఉందని చెప్పారని మిరపకాయ్ అనే సినిమా కథను హరీష్ మొదట నాకు చెప్పాడని నేను చేయలేకపోయాననే రిగ్రెట్ ఉందని ఆయన అన్నారని కోన వెంకట్ పేర్కొన్నారు.
మిరపకాయ్ సినిమాను మిస్ కావడం విషయంలో (Pawan Kalyan) పవన్ కళ్యాణ్ ఫీలయ్యారని కోన వెంకట్ కామెంట్ల ద్వారా అర్థమవుతోంది. హరీష్ శంకర్ ఫోన్ లో పవన్ కళ్యాణ్ ఫోటో ఫోన్ వాల్ పేపర్ గా ఉంటుందని అన్నారు. జల్సా సినిమా పోస్టర్ ను హరీష్ శంకర్ వాల్ పేపర్ గా పెట్టుకున్నారని చెప్పుకొచ్చారు. బ్రో సినిమా రిలీజ్ కు రెండు వారాల సమయం ఉండగా బ్రో మేకర్స్ ప్రమోషన్స్ పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.