దర్శక ధీరుడు రాజమౌళి ఆస్థాన సినిమాటోగ్రాఫర్ గా ఉన్నారు సెంథిల్ కుమార్. ఆయన ఏళ్లుగా రాజమౌళి సినిమాలకు పనిచేస్తున్నారు. రాజమౌళి టీమ్ లో సెంథిల్ కుమార్, మరియు కీరవాణి తప్పక ఉండాల్సిందే. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో తెరకెక్కిన బాహుబలి చిత్రాలకు కూడా డీఓపీ గా సెంథిల్ కుమార్ పని చేశారు. ఇక రాజమౌళి లేటెస్ట్ ప్రాజెక్ట్ ఆర్ ఆర్ ఆర్ మూవీ సినిమాటోగ్రాఫర్ కూడా సెంథిల్ కుమార్ కావడం విశేషం. తాజాగా ఓ ఇంటర్వ్యూలో సెంథిల్ కుమార్ ఆర్ ఆర్ ఆర్ కి సంబంధించి అనేక విషయాలు పంచుకున్నారు.
అలాగే షూటింగ్ ఎంత వరకు పూర్తి అయ్యింది అనే విషయాన్ని కూడా ఆయన తెలియజేయడం జరిగింది. లాక్ డౌన్ కి ముందు వరకు ఆర్ ఆర్ ఆర్ దాదాపు 70 శాతం షూటింగ్ పూర్తి చేసుకుందట. మిగిలిన 30 శాతం పూర్తి చేసి 2021 జనవరిలో చెప్పిన ప్రకారం మూవీ విడుదల చేద్దాం అనుకున్నారట రాజమౌళి. ఇక షూటింగ్స్ కి అనుమతి ఇచ్చిన తరువాత రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ టెస్ట్ షూట్ నిర్వహించాలని అనుకున్నారు. ఆ తరువాత ఆ నిర్ణయాన్ని ఆయన వెనక్కి తీసుకున్నారు.
దానికి కారణం ఆర్ ఆర్ ఆర్ షూట్ లో కనీసం 500 నుండి 600 వందల మంది పాల్గొనేవారట. అలాంటిది కరోనా వైరస్ కారణంగా 50 మందికి మించరాదని నిబంధనలు పెట్టడం జరిగింది. అయినప్పటికీ రాజమౌళి ప్రయత్నిద్దాం అనుకున్నారట. ఐతే కరోనా వైరస్ వ్యాప్తి ఉధృతం కావడంతో టెస్ట్ షూట్ నిర్వహించలేదని ఆయన చెప్పారు. మరో రెండు మూడు నెలల్లో షూట్ మొదలవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
Most Recommended Video
పవర్ స్టార్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఎస్.ఎస్.రాజమౌళి సినిమాల IMDB రేటింగ్స్!
తెలుగు సినిమాల్లో నటించిన 27 బాలీవుడ్ హీరోయిన్లు ఎవరో తెలుసా?