DSP: సర్కస్‌కి డీఎస్పీ మరో రెండు పాటలు ఇస్తున్నాడట

దేవిశ్రీప్రసాద్‌ సంగీతానికి ఫిదా కాని ప్రేక్షకులు ఉండరు. అది టాలీవుడ్‌ అయినా, కోలీవుడ్‌ అయినా ఆఖరికి బాలీవుడ్‌ అయినా. ఆయన బీట్ వచ్చిందంటే చాలు కాలు అలా కదుపుతూనే ఉంటారు. ఇటీవల విడుదలైన ‘సీటీమార్‌’ పాటకు వస్తున్న రెస్పాన్సే దానికి నిదర్శనం. ఆ పాట విజయం ఇచ్చిన ఊపో లేక ఇంకే కారణమో కానీ దేవికి మరో రెండు పాటలు బాలీవుడ్‌కి ఇచ్చే అవకాశం వచ్చిందట. రణ్‌వీర్‌ సింగ్‌ ప్రధాన పాత్రలో రోహిత్‌ శెట్టి రూపొందిస్తున్న ‘సర్కస్‌’కి దేవీ రెండు పాటలు ఇస్తున్నాడట.

రణ్‌వీర్‌ సింగ్‌ ‘సర్కస్‌’లో పూజా హెగ్డే, జాక్వెలైన్‌ ఫెర్నాండెజ్‌ కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ సినిమా కోసం దేవిశ్రీ ప్రసాద్‌ ఓ ప్రత్యేక గీతాన్ని, మరో రొమాంటిక్ సాంగ్‌ను సిద్ధం చేస్తున్నారట. ఐటెమ్‌ సాంగ్‌ ఇప్పటికే రెడీ కూడా అయ్యిందని టాక్‌. రొమాంటిక్‌ సాంగ్‌ పనిలో ప్రస్తుతం దేవీ ఉన్నాడట. ఇక్కడ వస్తున్న డౌట్‌ ఏంటంటే… ఆ రెండు పాటలు స్ట్రయిట్‌ సాంగ్సా లేక ఇక్కడి పాత పాటలను అక్కడికి తీసుకెళ్తున్నాడట. డీఎస్పీ పాత చరిత్ర చూసుకుంటే తెలుగులో హిట్‌ అయిన పాటల్నే బాలీవుడ్‌కి తీసుకెళ్లాడు.

మామూలుగా రోహిత్‌ శర్మ సినిమాలుం అంటేనే తెలుగు సినిమాలకు బాలీవుడ్‌ కోటింగ్‌లా ఉంటాయి. అలాంటిది ఇప్పుడు ఆయన సినిమాలో తెలుగు పాట అంటే ఏదో పూర్తి తెలుగు సినిమా చూసినట్లే ఉంటుందేమో. అన్నట్లు ఈ సినిమాను తెలుగులో కూడా విడుదల చేస్తారని ఆ మధ్య టాక్‌ వినిపించింది. ఒకవేళ అదే పని చేస్తే, దేవీ పాత్ర పాటలే ఇచ్చుంటే మన దగ్గర వచ్చిన పాటనే మరో భాషలో మళ్లీ వింటాం అన్నమాట.

Most Recommended Video

ధూమపానం మానేసి ఫ్యాన్స్ ని ఇన్స్పైర్ చేసిన 10 మంది హీరోల లిస్ట్..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!
ఈ 12 మంది డైరెక్టర్లు మొదటి సినిమాతో కంటే కూడా రెండో సినిమాతోనే హిట్లు కొట్టారు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus