బ్యా గ్రౌండ్ స్కోర్ తో జై లవకుశకి బలమిచ్చిన దేవీ శ్రీ ప్రసాద్!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తొలిసారి త్రిపాత్రాభినయం పోషించిన మూవీ జై లవకుశ. యువ దర్శకుడు బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా టీజర్లు, ట్రైలర్ అంచనాలను పెంచేసాయి. ఎన్టీఆర్ గత చిత్రాలు నాన్నకు ప్రేమతో, జనతాగ్యారేజ్ సినిమాలకు రాక్ స్టార్  దేవీ అద్భుతమైన ట్యూన్స్ ఇచ్చారు. వరుసగా మూడోసారి కూడా మంచి ట్యూన్స్ ఇచ్చారు. నిన్న సెన్సార్ సభ్యుల ముందుకు వెళ్లిన ఈ మూవీ గురించి ఆసక్తికర న్యూస్ బయటికి వచ్చింది. ఈ చిత్రాన్ని చూసిన వారందరూ ఎన్టీఆర్ నటనతో పాటు దేవీ ఇచ్చిన బ్యా గ్రౌండ్ స్కోర్ గురించి మాట్లాడుకుంటున్నారు.

కొన్ని సన్నివేశాలు నేపథ్య సంగీతంతో మరింత బాగావచ్చాయని అభినందిస్తున్నారు. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత దేవీ శ్రీ ప్రసాద్ కి మరింత పేరు వస్తుందని చెబుతున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లో కళ్యాణ్ రామ్ నిర్మించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 21 న రిలీజ్ కానుంది.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus