Mahesh Babu: ట్రెండింగ్ లో మహేష్ బాబు మూవీ.. మహేష్ మూవీ కలెక్షన్లు నిజమంటూ?

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన మహేష్ బాబు గతేడాది సర్కారు వారి పాట సినిమాతో విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. రిలీజ్ సమయంలో ఈ సినిమాకు నెగిటివ్ టాక్ వచ్చినా కమర్షియల్ గా ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిందనే సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ సినిమా నిర్మాతలకు కళ్లు చెదిరే స్థాయిలో లాభాలను అందించడం గమనార్హం. అయితే గత శుక్రవారం రోజున ఆదిపురుష్ మూవీ థియేటర్లలో విడుదలైన సంగతి తెలిసిందే.

ఈ సినిమా నెగిటివ్ టాక్ తో సైతం 360 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తం గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకోవడం గమనార్హం. అయితే ఈ సినిమా కలెక్షన్ల విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తెలుగులో మినహా ఎక్కడా ఈ సినిమాకు పాజిటివ్ రివ్యూలు రాలేదనే సంగతి తెలిసిందే. బాలీవుడ్ క్రిటిక్స్ ఈ సినిమాకు 2 కంటే తక్కువగా రేటింగ్స్ ఇచ్చారు. ఆదిపురుష్ నాలుగో రోజు కలెక్షన్లతో పోల్చి చూస్తే సర్కారు వారి పాట కలెక్షన్లు ఎక్కువగా ఉన్నాయనే విధంగా సోషల్ మీడియాలో సర్కారు వారి పాట ట్రెండింగ్ అవుతోంది.

మహేష్ (Mahesh Babu) మూవీ కలెక్షన్లు నిజమంటూ ఆదిపురుష్ మూవీ కలెక్షన్లు అబద్ధమంటూ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తుండటం గమనార్హం. అయితే ఆదిపురుష్ కలెక్షన్లు నిజమేనని ప్రభాస్ ఫ్యాన్స్ చెబుతున్నారు. మరోవైపు ఆల్ ఇండియన్ సినీ వర్కర్స్ అసోసియేషన్ సైతం ఈ సినిమాను ప్రదర్శించడాన్ని నిషేధించాలని కోరుతుండటం గమనార్హం.

హిందువుల మతపరమైన సెంటిమెంట్లను, సనాతన ధర్మాన్ని దెబ్బ తీసే విధంగా ఈ సినిమా ఉందని రాముడు, హనుమంతుడిని కించపరిచే విధంగా డైలాగ్స్, కథనం ఉన్నాయని వాళ్లు చెబుతున్నారు. ఆదిపురుష్ సినిమాపై వివాదాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. నెగిటివ్ టాక్ తో కూడా కళ్లు చెదిరే స్థాయిలో కలెక్షన్లు సాధించడం ప్రభాస్ కే సాధ్యమని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.

ఆదిపురుష్ సినిమా రివ్యూ & రేటింగ్!

‘సైతాన్’ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
కుటుంబం కోసం జీవితాన్ని త్యాగం చేసిన స్టార్ హీరోయిన్స్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus