కామెడీ బాగుంది సరే.. కాసులే కానరాలేదు!

ఒక్కోసారి సినిమాకి మంచి పేరొస్తే డబ్బులు రావు, డబ్బు వస్తే మంచి పేరు రాదు. ఇది నిన్నమొన్నటివరకూ వినిపించిన మాట. ఈ మాట అబద్ధమని ఈమధ్య వచ్చిన “తొలిప్రేమ, రంగస్థలం, భరత్ అనే నేను, మహానటి” చిత్రాలతో తేలిపోయింది. అయితే.. విడుదలకు ముందు విపరీతమైన బజ్ క్రియేట్ అయ్యి, విడుదల అనంతరం కూడా ఫస్ట్ 2 డేస్ వరకూ సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది. వచ్చిన రెస్పాన్స్ కి సినిమా సూపర్ హిట్ అయిపోతుంది అనుకొన్నారందరూ. కట్ చేస్తే.. సగానికిపైగా రివ్యూలు నెగిటివ్ గా కాకపోయినా.. సినిమా ఇంకా బెటర్ గా ఉండొచ్చు కామెడీ తప్ప సినిమాలో ఏమీ లేదు అంటూ విశ్లేషణలు వెలువడ్డాయి. దాంతో ఓవర్సీస్ లో ఆ రివ్యూల ఎఫెక్ట్ కాస్త గట్టిగానే పడింది. సునాయాసంగా ఒన్ మిలియన్ క్రాస్ చేస్తుంది అనుకొన్న ఈ చిత్రం ఇప్పటివరకు ఓవర్సీస్ లో కనీసం హాఫ్ మిలియన్ కూడా వసూలు చేయలేకపోయింది.

ఇక రూరల్ ఏరియాల్లో అయితే.. సెకండ్ వీక్ కి వచ్చేసరికి కనీసం సగం థియేటర్ కూడా నిండడం లేదు. వర్షాలు కూడా గట్టిగా పడుతుండడంతో జనాలు కూడా పెద్దగా ఆసక్తి చూపడం లేదు. సురేష్ బాబు పెట్టిన బడ్జెట్ ప్రకారం చూసుకుంటే కమర్షియల్ గా హిట్ అయ్యుండొచ్చు కానీ.. తరుణ్ భాస్కర్ ప్రీవీయస్ ఫిలిమ్ “పెళ్లి చూపులు”తో కంపేర్ చేస్తే మాత్రం ఈ సినిమా బిలో యావ్రేజ్ కిందకే లెక్క వేయాల్సిన పరిస్థితి నెలకొని ఉంది. సరైన ప్రమోషన్స్ కూడా లేకపోవడం సినిమాకి పెద్ద మైనస్ గా మారింది. అందరూ కొత్తవాళ్లే.. పైగా టీవి ప్రమోషన్స్ కానీ, ఆన్ లైన్ ప్రమోషన్స్ కానీ అస్సలు చేయలేదు. అందువల్ల “ఈ నగరానికి ఏమైంది?” రిజల్ట్ విషయంలో ఇంకా క్లారిటీ లేదు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus