దుల్కర్ సల్మాన్ హిందీ డెబ్యూ ట్రైలర్ అదిరింది

“మహానటి”తో తెలుగు ప్రేక్షకుల మనసుల్లో సుస్థిర స్థానం సంపాదించుకొన్న దుల్కర్ సల్మాన్ మలయాళ చిత్రాలకు కూడా తెలుగులో మంచి క్రేజ్ పెరిగింది. అలాంటి దుల్కర్ ఇప్పుడు హిందీలో డెబ్యూ చేస్తున్నాడు. ఆకర్ష్ ఖురానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ కీలకపాత్ర పోషిస్తుండగా.. షార్ట్ ఫిలిమ్స్ ద్వారా విశేషమైన పాపులారిటీ సంపాదించుకొన్న మిథాలీ పాల్కర్ కథానాయికగా నటిస్తోంది. “కార్వాన్” అనే పేరుతో రూపొందుతున్న ఈ చిత్రం ట్రైలర్ ఇవాళ విడుదలైంది. మంచి కథతోపాటు హ్యూమర్ కూడా కావాల్సినంత ఉండడం, ఇర్ఫాన్ ఖాన్ లాంటి నట దిగ్గజం, మిథాలీ హీరోయిన్ గా నటిస్తుండడంతో ఈ చిత్రంపై బాలీవుడ్ లోనే కాక రెగ్యులర్ మూవీ గోయర్స్ అందరికీ మంచి అంచనాలున్నాయి.

ఒక కొరియర్ కంపెనీ ద్వారా ముంబై చేరాల్సిన తన తండ్రి మృతదేహం పార్సిల్స్ మారిపోవడంతో.. వేరే మృతదేహం వస్తుంది. ఆ మృతదేహాన్ని తీసుకొని తన తండ్రి మృతదేహాన్ని ఎక్చేంజ్ కోసం డ్రైవర్ ఇర్ఫాన్ ఖాన్ తో కలిసి ఊటీ బయలుదేరతాడు మన హీరో. అలా మొదలైన ప్రయాణంలో అతడు తెలుసుకొన్న జీవిత సత్యాలేమిటి, చివరికి తండ్రి మృతదేహం లభించిందా లేదా అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిన విషయం. వినడానికే చాలా వైవిధ్యంగా ఉన్న ఈ సినిమాతో దుల్కర్ హిందీలోనూ మంచి గుర్తింపు తెచ్చుకోవడం ఖాయమని అప్పుడే అతడి అభిమానులు ఫిక్స్ అయిపోయారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus