క్రేజ్ ను క్యాష్ చేసుకోవడం అనే పద్ధతిని సినిమా ఇండస్ట్రీలో ఫాలో అయినట్లుగా మరెక్కడా వాడరేమో. ఒక హీరోయిన్ సినిమా హిట్ అయ్యి.. ఆమెకు కాస్త క్రేజ్ క్రియేట్ అయ్యిందంటే చాలు.. ఆమె నటించిన మునుపటి సినిమాలను డబ్బింగ్ రూపంలో విడుదల చేసి క్యాష్ చేసుకొంటారు. ఇప్పుడు ఆ ఫార్మాట్ ను హీరో విషయయంలోనూ వాడుతున్నారు. “మహానటి” చిత్రంతో తెలుగులో విపరీతమైన క్రేజ్, పాపులారిటీ సంపాదించుకొన్న మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ క్రేజ్ ను కూడా క్యాష్ చేసుకొనేందుకు సన్నద్ధమవుతున్నారు మన తెలుగు నిర్మాతలు.
అందులో భాగంగా.. దుల్కర్ నటించగా మలయాళంలో విడుదలై మంచి విజయం సాధించడంతోపాటు.. పలు వివాదాలకు తెరలేపిన “సోలో” చిత్రాన్ని “అతడే” అనే పేరుతో డబ్బింగ్ చేస్తున్నారు. “అమ్మాడి” అంటూ తెలుగు ప్రేక్షకులకు చేరువైన దుల్కర్ “అతడే”తో ఇంకాస్త దగ్గరైతే ఇక అతడి సినిమాలన్నీ తెలుగులో డబ్బింగ్ రూపంలో విడుదలవ్వడం ఖాయం. ఇదివరకు “ఒకే బంగారం”తో పలకరించి విజయాన్నందుకొన్నా ఆ తర్వాత ఫాలోలో మరో హిట్ లేకపోవడంతో తెలుగు ప్రేక్షకులు దుల్కర్ ను పెద్దగా పట్టించుకోలేదు.