Guntur Kaaram Song: సంక్రాంతి మాస్ ఆడియన్సే.. టార్గెట్ గా ‘దమ్ మసాలా’ సాంగ్!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో ‘అతడు’ ‘ఖలేజా’ వంటి క్రేజీ సినిమాల తర్వాత వస్తున్న పర్ఫెక్ట్ మాస్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘గుంటూరు కారం’. ‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్’ బ్యానర్ పై ఎస్.రాధాకృష్ణ(చినబాబు) ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎస్.ఎస్.తమన్ సంగీత దర్శకుడు. ఈ చిత్రం నుండి ఫస్ట్ సింగిల్ వస్తుందని చాలా కాలం నుండి ప్రచారం జరుగుతుంది.

ఇటీవల ఈ పాటకు సంబంధించిన చిన్న బిట్ లీక్ అవ్వడంతో … వెంటనే ఫస్ట్ సింగిల్ డేట్ ను అనౌన్స్ చేసింది చిత్ర బృందం. ఈరోజు త్రివిక్రమ్ శ్రీనివాస్ పుట్టినరోజు కావడంతో కొద్దిసేపటి క్రితం ‘గుంటూరు కారం’ నుండి మొదటి పాటను విడుదల చేశారు. ‘సుర్రుమండుతాది బాబు గొడ్డు కారం.. గిర్ర తిరుగుతాది ఈడితోటి బేరం’ అంటూ ఈ ‘దమ్ మసాలా’ పాట మొదలైంది. సంగీత దర్శకుడు తమన్ మాస్ ఆడియన్స్ ను దృష్టిలో పెట్టుకుని ఈ పాటని డిజైన్ చేశాడు.

టార్గెటెడ్ ఆడియన్స్ కి ఈ పాట వెంటనే కనెక్ట్ అవ్వొచ్చు. కానీ ‘అల వైకుంఠపురములో’ ఫస్ట్ సింగిల్ ‘సామజవరగమన’ రేంజ్లో అయితే ఈ పాట లేదు అనే చెప్పాలి. తమన్ అందించిన ట్యూన్ ఎవ్వరిలోనూ జోష్ నింపేలా అయితే లేదు. ఒకవేళ ఇది హీరో ఎలివేషన్ సాంగ్ కాబట్టి విజువల్ గా చూస్తే నచ్చే అవకాశం ఉండొచ్చు.

అలాగే సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ సినిమా (Guntur Kaaram) రిలీజ్ అవుతుంది కాబట్టి.. ఆ ఫీల్ ని కలిగించేలా ఈ పాటని మేకర్స్ మొదటిగా వదిలి ఉండొచ్చు మీరు కూడా ఈ లిరికల్ సాంగ్ ని ఒకసారి చూస్తూ వినేయండి :

మా ఊరి పొలిమేర 2 సినిమా రివ్యూ & రేటింగ్!

కీడా కోలా సినిమా రివ్యూ & రేటింగ్!
నరకాసుర సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus