Dunki Movie: ‘డంకీ’ మొదటి రోజు ఎంత కలెక్ట్ చేయొచ్చు..!

‘పఠాన్’ ‘జవాన్’ వంటి రెండు రూ.1000 కోట్ల సినిమాలు సాధించి సూపర్ ఫామ్లో ఉన్నాడు బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్. అతని లేటెస్ట్ మూవీ ‘డంకీ’ ఈరోజు అనగా డిసెంబర్ 21 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అపజయమంటూ ఎరగని బాలీవుడ్ స్టార్ దర్శకుడు రాజ్ కుమార్ హిరాని డైరెక్షన్లో రూపొందిన సినిమా ఇది.షారూక్ ఖాన్‌తో పాటు తాప్సీ పన్ను, బోమన్ ఇరాని, విక్కీ కౌశల్, విక్రమ్ కొచ్చర్, అనీల్ గ్రోవర్ వంటి స్టార్స్ కూడా ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషించారు.

‘జియో స్టూడియోస్’ ‘రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్స్’ ‘రాజ్ కుమార్ హిరాని ఫిలిమ్స్’ బ్యానర్ పై గౌరీ ఖాన్, రాజ్ కుమార్ హిరాని, జ్యోతి దేశ్ పాండే ..లు కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. అయితే ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకి మిక్స్డ్ టాక్ వచ్చింది. కొంతమంది బాగుంది అంటున్నారు, ఇంకొంతమంది రాజ్ కుమార్ హిరానీ మ్యాజిక్ మిస్సయ్యింది అంటున్నారు.

దీంతో మొదటి రోజు ఈ సినిమా ఎంత కలెక్ట్ చేయొచ్చు అనే ప్రశ్న అందరిలోనూ ఉంది. అందుతున్న సమాచారం.. ప్రకారం ‘డంకీ’ సినిమా మొదటిరోజు వరల్డ్ వైడ్ గా రూ.65 కోట్ల నుండి రూ.70 కోట్ల గ్రాస్ ను అందుకునే అవకాశం ఉంది. ‘పఠాన్’ ‘జవాన్’ సినిమాలు మొదటి రోజు రూ.100 కోట్ల పైనే గ్రాస్ ను కలెక్ట్ చేశాయి. కానీ ‘డంకీ’ (Dunki) విషయంలో అది రిపీట్ అయ్యే ఛాన్స్ లేదు.

మహేష్, చరణ్..లతో పాటు ఈ ఏడాది ఒక్క సినిమాతో కూడా ప్రేక్షకుల ముందుకు రాని హీరోల లిస్ట్

‘హాయ్ నాన్న’ నుండి ఆకట్టుకునే 18 డైలాగులు ఇవే..!
‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ నుండి ఆకట్టుకునే 20 డైలాగులు ఇవే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus