Eagle: స్పీడ్ పెంచిన ‘ఈగల్’ టీం.. ట్రైలర్ కూడా రెడీ.. ఎప్పుడంటే?

  • December 18, 2023 / 06:51 PM IST

మాస్ మహారాజ్ రవితేజ నుండి రాబోతున్న నెక్స్ట్ మూవీ ‘ఈగల్’.కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ సంస్థ పై టి.జి.విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల కలిసి నిర్మిస్తున్నారు. 2024 సంక్రాంతి కానుకగా జనవరి 13 న ఈ సినిమా రిలీజ్ కాబోతున్నట్లు చిత్ర బృందం ఎప్పుడో ప్రకటించింది. ఆల్రెడీ ఫస్ట్ లిరికల్ సాంగ్ గా ‘ఆడు మచ్చా’ అనే మాస్ సాంగ్ ను విడుదల చేశారు. దానికి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది.

అంతకు ముందు టీజర్ ను కూడా విడుదల చేయగా… అది కూడా ప్రేక్షకులను ఇంప్రెస్ చేసింది అని చెప్పొచ్చు. అయితే మరోపక్క ‘ఈ సినిమా నిజంగానే సంక్రాంతి కానుకగా రిలీజ్ అవుతుందా? ‘ అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతూనే ఉన్నాయి. అలాంటి వాటికి ఫుల్ స్టాప్ పెట్టాలని చిత్ర బృందం డిసైడ్ అయ్యింది. ఈ క్రమంలో ట్రైలర్ లాంచ్ కి కూడా రంగం సిద్ధమైంది. అవును ‘ఈగల్’ ట్రైలర్ డిసెంబర్ 20న విడుదల కాబోతుంది.

తాజాగా చిత్ర బృందం ఈ విషయం పై అధికారిక ప్రకటన ఇచ్చింది. డిసెంబర్ 20 న సాయంత్రం 4 గంటల 5 నిమిషాలకు ‘ఈగల్’ టీజర్ రిలీజ్ కానుంది. సో సంక్రాంతే టార్గెట్ గా ప్రమోషన్ డోస్ పెంచింది చిత్ర బృందం అని చెప్పాలి. ట్రైలర్ అప్డేట్ తో పాటు ఓ స్పెషల్ పోస్టర్ ను కూడా ప్రేక్షకులతో పంచుకుంది. ఇందులో హీరో రవితేజ గన్ తో ప్రత్యర్థుల పై దాడి చేస్తూ బుల్లెట్ల వర్షం కురిపిస్తున్నట్టు కనిపిస్తుంది. ఇది (Eagle) ట్రైలర్ పై అందరిలో క్యూరియాసిటీ పెంచిందని చెప్పొచ్చు.

మహేష్, చరణ్..లతో పాటు ఈ ఏడాది ఒక్క సినిమాతో కూడా ప్రేక్షకుల ముందుకు రాని హీరోల లిస్ట్

‘హాయ్ నాన్న’ నుండి ఆకట్టుకునే 18 డైలాగులు ఇవే..!
‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ నుండి ఆకట్టుకునే 20 డైలాగులు ఇవే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus