‘మనమంతా’ జనతా గ్యారేజ్’ ‘మన్యం పులి’ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకి కూడా దగ్గరయ్యారు మలయాళం స్టార్ హీరో మోహన్ లాల్. 62 ఏళ్ళ వయసులో కూడా ఆయన స్టార్ ఇమేజ్ ను మెయింటైన్ చేస్తున్నారు. ఆయన సినిమాలు తెలుగులో కూడా డబ్ అవడాన్ని మనం చూస్తూ వస్తున్నాం. ఇదిలా ఉండగా.. తాజాగా ఆయన చిక్కుల్లో పడినట్టు తెలుస్తుంది. మనీ లాండరింగ్ కేసులో మోహన్ లాల్ ఇరుక్కున్నారు.ఆయన పై చాలా ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.
దీంతో ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు మోహన్ లాల్‌కు నోటీసులు పంపారు. వచ్చే వారం కొచ్చి ఈడీ కార్యాలయంలో మోహన్‌లాల్‌ను హాజరుపరచనున్నారు అధికారులు. అదే సమయంలో ఆయన్ని ఇంటరాగేట్ చేస్తారని తెలుస్తుంది. అసలు మోహన్ లాల్ పై ఇలాంటి ఆరోపణలు ఎందుకు వ్యక్తమయాయ్యి అనే అనుమానాలు అందరిలోనూ ఉన్నాయి.వివరాల్లోకి వెళ్తే… పురాతన వస్తువుల వ్యాపారి మాన్సన్ మాన్కల్‌తో కలిసి మోహన్ లాల్ మనీ లాండరింగ్‌కు పాల్పడినట్లు అధికారులకు సమాచారం వెళ్ళిందట.
రూ. 10 కోట్ల మేర ప్రజల్ని మోసం చేశారు అంటూ మాన్సన్‌ను గత సెప్టెంబర్‌లో కూడా కేరళ పోలీసులు అరెస్టు చేయడం జరిగింది. మాన్సన్ కేరళలో ఉంటారు. ఆయన ఇంటికి కూడా మోహన్ లాల్ ఒకసారి వెళ్ళారట. మోహన్ లాల్ ఎందుకు మాన్సన్ ఇంటికి వెళ్లినట్టు.. ? అనే విషయం పై అనుమానాలు మొదలయ్యాయి.అభిమానుల్లో ఆందోళన కూడా మొదలైంది. దీనిపై మరిన్ని విషయాలు తెలియాల్సి ఉంది. మోహన్ లాల్ నటిస్తున్న మూడు సినిమాలు ప్రస్తుతం సెట్స్ పై ఉన్నాయి.
Most Recommended Video
మహేష్ బాబు 26 సినిమాలు.. మరియు వాటి బాక్సాఫీస్ కలెక్షన్లు..!
‘భద్ర’ టు ‘అఖండ’.. బోయపాటి డైరెక్ట్ చేసిన సినిమాల కలెక్షన్లు..!
‘దూకుడు’ టు ‘సర్కారు వారి పాట’.. ఓవర్సీస్ లో మహేష్ బాబు 1 మిలియన్ మూవీస్ లిస్ట్..!