రాజ్యసభలో ఎంపురాన్ గొడవ.. జెట్ స్పీడ్ లో ఈడీ దాడులు?

మోహన్ లాల్ (Mohanlal) , పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) కాంబినేషన్‌లో వచ్చిన ఎంపురాన్ (L2: Empuraan) సినిమా ఇప్పటికే వివాదాల్లో చిక్కుకుపోయింది. తాజాగా ఈ సినిమాను నిర్మించిన గోకులం గోపాలన్ కంపెనీపై ఈడీ అధికారులు శుక్రవారం దాడులు చేయడం మలయాళ సినిమా వర్గాల్లో కలకలం రేపింది. కేరళ, చెన్నైలోని ఆయనకు చెందిన కార్యాలయాలపై ఈడీ ఒకేసారి సోదాలు జరిపింది. దీంతో ఇది సినిమాకు సంబంధించిన వివాదం నేపథ్యంలో వచ్చిన పరిణామమా? లేక ఇది కేవలం ఆర్థిక విచారణా? అనే చర్చ మొదలైంది.

L2 Empuraan:

గోకులం గోపాలన్ కు చెందిన చిట్ ఫండ్ కంపెనీ గతంలోనూ వివాదాల్లోకి వచ్చింది. 2017లోనే ఆదాయపు పన్నుశాఖ దాడులు చేసి, వేల కోట్ల పన్ను ఎగవేత ఆరోపణలు చేసింది. ఇప్పుడు మాత్రం ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్‌మెంట్ యాక్ట్ (FEMA) ఉల్లంఘనలపై ఈడీ విచారణ జరుపుతోంది. నిధుల మళ్లింపు, లాయల్టీ చెల్లింపులు, విదేశీ లావాదేవీలపై సంస్థపై అనుమానాలు ఉన్నాయని సమాచారం. ఇది ఇలా ఉంటే, ఎంపురాన్ సినిమాలోని కొన్ని సీన్లు..

ముఖ్యంగా గోద్రా అల్లర్లతో సంబంధం ఉన్న దృశ్యాలపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. దీంతో సినిమా సెన్సార్ బోర్డులోనే తారసపడి ట్రిమ్ వెర్షన్ విడుదలైంది. అయితే వివాదం అక్కడితో ఆగలేదు. రాజ్యసభ వరకు ఈ వివాదం వెళ్లింది. కేంద్ర మంత్రి సురేష్ గోపి సభలో ఫైర్ అవుతూ, వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలోనే ఈడీ దాడులు జరగడం పైశాచిక ప్రతీకార చర్యల ముద్ర వేస్తోంది. బాలీవుడ్, టాలీవుడ్‌ తో పాటు మాలీవుడ్ లోనూ ఇలాంటి ఘటనలు ఇంతకుముందు జరిగాయి.

కానీ సినిమా విషయంపై పార్లమెంట్ లో చర్చ జరుగుతున్న రోజుల్లోనే నిర్మాతపై ఈడీ దాడులు జరగడం, రాజకీయ కోణాన్ని కలిగిస్తోంది. దీనికి సంబంధించి అధికార ప్రతినిధులు స్పందించనప్పటికీ, ఇది కేవలం సహజ విచారణే అనే అభిప్రాయం అధికార వర్గాల్లో వినిపిస్తోంది. అయితే ఎంపురాన్ (L2 Empuraan) టీం మాత్రం దీనిపై స్పందించలేదు. కీలక డాక్యుమెంట్లు, డిజిటల్ డేటా స్వాధీనం చేసుకున్న ఈడీ, మరిన్ని డెవలప్‌మెంట్లు వెలుగులోకి తేవొచ్చన్న టాక్ ఉంది. ప్రస్తుతం ఈ వ్యవహారం రాజకీయంగా, సినీ రంగాన్ని కలిపిన హాట్ టాపిక్‌గా మారింది.

క్లాస్‌ పీకిన శైలేష్‌ కొలను.. అయితే టీమ్‌ ఇస్తున్న లీకుల సంగతేంటో?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus