టిల్లు సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకోవడమే కాక, నటుడిగా బీభత్సమైన ఇమేజ్ సొంతం చేసుకున్న సిద్ధు జొన్నలగడ్డ కాస్త తన ఇమేజ్ నుంచి బయటకు వచ్చి, బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం “జాక్”. ఆల్రెడీ విడుదలైన టీజర్ & కిస్ సాంగ్ మంచి బజ్ క్రియేట్ చేసాయి. ఏప్రిల్ 10న విడుదలవుతున్న ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి.
ఈ ప్రమోషన్స్ ను మరింత ముందుకు తీసుకెళ్తూ నిన్న (ఏప్రిల్ 02) జాక్ ట్రైలర్ ను విడుదల చేసారు బృందం. తొలుత AAA సినిమాస్ లో ఈవెంట్ నిర్వహించి రిలీజ్ చేద్దామనుకున్నప్పటికీ.. చివరి నిమిషంలో పోలీస్ పర్మిషన్ మరియు టెక్నికల్ ఇష్యూస్ కారణంగా ఈవెంట్ క్యాన్సిల్ చేసి, ఇవాళ (ఏప్రిల్ 03) విడుదల చేసారు. కోర్ పాయింట్ “ఏజెంట్” సినిమాను గుర్తుచేయడం ఖాయం. ఒకవేళ “ఏజెంట్” సినిమాని సరిగ్గా తీసి ఉంటే జాక్ లా ఉండేదేమో అనిపించింది.
టిల్లు బాడీ లాంగ్వేజ్ ని కాస్త కంట్రోల్లో పెట్టి, చిన్నపాటి లాజిక్స్ యాడ్ చేసినట్లుగా ఉంది జాక్ పాత్ర. అయితే డైలాగ్స్ విషయంలో మాత్రం టిల్లు కనిపించాడు, వినిపించాడు. వైష్ణవి చైతన్య అందంగా కనిపిస్తూ.. మంచి స్క్రీన్ ప్రెజన్స్ తో ఆకట్టుకోగా, ప్రకాష్ రాజ్ కి చాన్నాళ్ల తర్వాత మంచి పాత్ర లభించింది.
కంటెంట్ క్వాలిటీ పరంగా హై లెవల్లో ఉండగా.. డైలాగ్స్ మంచి వైరల్ అవ్వడం ఖాయం. ముఖ్యంగా చివర్లో వచ్చే డైలాగ్స్ అయితే యూత్ అండ్ సిద్ధు ఫ్యాన్స్ ని విశేషంగా ఆకట్టుకుంటాయి. చూస్తుంటే జాక్ తో సిద్ధు హ్యాట్రిక్ హిట్ కొట్టడమే కాక బొమ్మరిల్లు భాస్కర్ కి చాన్నాళ్ల తర్వాత ఒక మంచి కమర్షియల్ సక్సెస్ దక్కేలా ఉంది.