క్లాస్‌ పీకిన శైలేష్‌ కొలను.. అయితే టీమ్‌ ఇస్తున్న లీకుల సంగతేంటో?

‘హిట్‌’ (HIT)  సినిమాలతో మాత్రమే ‘హిట్‌’ కొడుతున్న దర్శకుడు శైలేష్‌ కొలను (Sailesh Kolanu) ఇటీవల తన ఎక్స్‌ అకౌంట్‌లో ఓ పెద్ద పెట్టారు. మీరు కూడా చూసే ఉంటారు. సినిమాల కోసం తాము చాలా కష్టపడుతున్నామని, వేల మంది కష్టం సినిమా అని, ప్రేక్షకుడి వెండితెరపై వినోదం అందించడానికి, ఆశ్చర్యపరడానికి కొన్ని సీన్లు, పాత్రలు అనుకుంటామని, వాటిని వెండితెర మీద చూసే ముందే లీకులు చేసేస్తున్నారు అని ఆయన పోస్టు సారాంశం. ఈ క్రమంలో ఆయన జర్నలిజం ఎలా ఉండాలి, ఎలాంటి జర్నలిజం చేయాలి, జర్నలిజం చరిత్ర అంటూ క్లాసు పీకే ప్రయత్నం చేశారు.

Sailesh Kolanu

ఇదంతా ‘హిట్‌ 3’  (HIT 3) సినిమా క్లైమాక్స్‌లో ఓ సర్‌ప్రైజ్‌ ఉంది అని.. ఆ పాత్రలో ప్రముఖ తమిళ కథానాయకుడు కార్తి (Karthi) నటిస్తారు అని ఓ సమాచారం లీకైంది. ఆసక్తికరంగా ఉండటంతో వెబ్‌సైట్‌లు, మెయిన్‌ స్ట్రీమ్‌ మీడియా దీనిని కవర్‌ చేశాయి. తెలుగు సినిమా అందులోనూ నాని కెరీర్‌ బిగ్గెస్ట్‌ కాన్వాస్‌, బడ్జెట్‌, బిల్డప్‌ ఉన్న సినిమా అని.. ఆ సినిమా విషయంగా కార్తి మేటర్‌ వార్త అయింది. అయితే తాము వెండితెర మీద ఆ పాత్ర చూపించి సర్‌ప్రైజ్‌ చేద్దాం అనుకున్నామని.. ముందుగా రాసేశారు అని ఆ సినిమా దర్శకుడు శైలేష్‌ కొలను బాధపడ్డాడరు.

ఆయన చెప్పిన విషయం నిజమే కావొచ్చు. ఎందుకంటే ప్రేక్షకుల్ని సర్‌ప్రైజ్‌ చేయాలి అనుకోవడం కరెక్టే. అయితే ఆ సమాచారం బయటకు రాకుండా చూసుకోవాలి అనేది టీమ్‌ చేయాల్సిన పని. ఎలా సమాచారం బయటకు రాకుండా చేయాలో మన దగ్గర చాలామంది దర్శకులకు తెలుసు. ఇక సినిమా బజ్‌ తక్కువగా ఉన్నప్పుడు సినిమాలోని కొన్ని కీలక పాయింట్లను చిత్రబృందమే అన్‌ అఫీషియల్‌గా లీకు చేస్తూ ఉంటుంది. కొన్ని సినిమాలకైతే పోస్టర్లే బయటకు వచ్చేస్తాయి. మరి వాటిని ఏమనాలో?

ఇదంతా చూస్తుంటే లీకులు మేం ఇస్తాం.. మీరు లీకులు చేయకూడదు అని అంటున్నట్లు ఉంది. పైన చెప్పిన లీకులు ఇవ్వడం శైలేష్‌ కొలను అండ్‌ టీమ్‌ ఎప్పుడూ చేయకపోయి ఉండొచ్చేమో.. కానీ టాలీవుడ్‌లో ఈ సంస్కృతి ఉంది అనేది కొట్టిపారేయలేని నిజం. కాబట్టి శైలేష్‌ ఏ ‘కొలను’లో ఉన్నారో చూసుకొని ఈ పోస్టు పెట్టాల్సింది అని నెటిజన్లు సూచిస్తున్నారు.

‘జాక్’.. దర్శకుడు లేకుండానే ఆ సాంగ్ షూట్ చెశారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus