రెండేళ్ల క్రితం పెళ్లిచూపులు సినిమాతో తరుణ్ భాస్కర్ మ్యాజిక్ చేశారు. సున్నితమైన ప్రేమకథని తీసుకొని అటు యువతని, ఫ్యామిలీ ఆడియన్స్ ని కట్టిపడేసారు. ఆ తర్వాత ఇప్పుడు “ఈ నగరానికి ఏమైంది ?” అనే డిఫెరెంట్ కథతో మనముందుకు వచ్చారు. శుక్రవారం విడుదలయిన ఈ సినిమా నగరవాసులను విశేషంగా ఆకట్టుకుంది. నూతన నటీనటులు విశ్వక్సేన్ నాయుడు, సుశాంత్‌రెడ్డి, అభినవ్ గోమతం, వెంకటేశ్ కాకుమాను, అనిషా ఆంబ్రోస్, సిమ్రన్ చౌదరిలు అద్భుతంగా నటించి వినోదాన్ని అందిస్తున్నారు.
ప్రముఖ నిర్మాత సురేష్ బాబు నిర్మించిన ఈ సినిమా ఇక్కడ మాత్రమే కాకుండా ఓవర్సీస్ లోను దూకుడు ప్రదర్శించింది. ప్రీమియర్ల ద్వారా 98,488 డాలర్లను రాబట్టిన ఈ సినిమా , శుక్రవారం రోజున 73,000 డాలర్లను వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు చెపుతున్నాయి. సినిమాకు హిట్ టాక్ రావడం తో శని, ఆదివారాల్లో వసూళ్లు మరింత పెరిగే అవకాశముందని చెపుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనూ మంచి కలక్షన్స్ రాబట్టిందని ట్రేడ్ వర్గాలవారు చెప్పారు. డిఫరెంట్ కథతో యువతని ఆకట్టుకొని రెండో విజయాన్ని తరుణ్ భాస్కర్ తన వేసుకున్నారు.