‘రాజు వెడ్స్ రాంబాయి’ ఫేమ్ అఖిల్‌రాజ్, త్రిగుణ్, హెబ్బా పటేల్, సిరి హనుమంతు ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన హర్రర్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ‘ఈషా'(Eesha).బబ్లూ పృథ్వీరాజ్ వంటి సీనియర్ నటులు కూడా ఇందులో కీలక పాత్రలు పోషించారు. ‘హెచ్‌వీఆర్ ప్రొడక్షన్స్’ బ్యానర్ పై నిర్మాత కేఎల్ దామోదర ప్రసాద్ సమర్పణలో హేమ వెంకటేశ్వరరావు ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించగా..శ్రీనివాస్ మన్నె దర్శకత్వం వహించారు.
‘వంశీ నందిపాటి ఎంటర్టైన్మెంట్స్’, ‘బన్నీ వాస్ వర్క్స్’ సంస్థల పై వంశీ నందిపాటి, బన్నీ వాస్ ఈ చిత్రాన్ని క్రిస్మస్ కానుకగా డిసెంబరు 25న గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు. ‘లిటిల్ హార్ట్స్’ ‘రాజు వెడ్స్ రాంబాయి’ వంటి సినిమాలు ఇటీవల రిలీజ్ అయ్యి సూపర్ హిట్లు అయ్యాయి. దీంతో ‘ఈషా’ కి బిజినెస్ డీసెంట్ గానే జరిగింది.

మొదటి రోజు ఈ సినిమాకి మిక్స్డ్ టాక్ వచ్చింది. కానీ ఓపెనింగ్స్ పర్వాలేదు అనిపించాయి.ఒకసారి ఫస్ట్ డే కలెక్షన్స్ ను గమనిస్తే :
| నైజాం | 0.36 cr |
| సీడెడ్ | 0.08 cr |
| ఆంధ్ర(టోటల్) | 0.23 cr |
| ఏపీ + తెలంగాణ(టోటల్) | 0.67 cr |
| రెస్ట్ ఆఫ్ ఇండియా | 0.04 cr |
| టోటల్ వరల్డ్ వైడ్ | 0.71 కోట్లు(షేర్) |
‘ఈషా’ సినిమాకి రూ.2.75 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది.కొన్ని ఏరియాల్లో పర్సెంటేజీ బేసిస్ పై రిలీజ్ చేసుకున్నారు. ఏదేమైనప్పటికీ మొత్తంగా ‘ఈషా’ సినిమా రూ.3.2 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. మొదటి రోజు ఈ సినిమా రూ.0.71 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కోసం మరో రూ.2.49 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.
