Eesha Rebba: పీరియడ్స్‌ గురించి హీరోయిన్ ఈషా రెబ్బా షాకింగ్ కామెంట్స్

ఎంత సినిమా వాళ్ళు అయినా వాళ్ళకి కూడా సామాన్యులకు ఉండే ఇబ్బందులే ఉంటాయి. ముఖ్యంగా హీరోయిన్లు నెలసరి టైంలో షూటింగ్లో పాల్గొంటారా? ఒకవేళ అలాంటి టైంలో షూటింగ్లో పాల్గొనాల్సి వస్తే..వారు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు? సినిమా యూనిట్ వారి బాధని అర్థం చేసుకుని ఏమైనా సాయం చేస్తుందా? అనే డౌట్స్ చాలా మందికి ఉండొచ్చు. ఈ విషయాల పై తాజాగా హీరోయిన్ ఈషా రెబ్బా (Eesha Rebba) స్పందించి ఆసక్తికర విషయాలు తెలిపింది.

ఈషా రెబ్బా.. ‘‘పీరియడ్స్‌ టైంలో మేము షూటింగ్ కి గ్యాప్ ఇవ్వడం సాధ్యమయ్యే పని కాదు. ఆ టైంలో కాంబినేషన్‌ సీన్లు, టిపికల్‌ సీన్లు ఉండొచ్చు. కాబట్టి కుదరదు. అలాంటి టైంలో నేను షూటింగ్లో పాల్గొన్న సందర్భాలు ఉన్నాయి. అప్పుడు నరకంగా అనిపించేది. కాకపోతే.. డైరెక్టర్‌కి చెబితే కాసేపు రెస్ట్‌ తీసుకునే టైం ఇస్తారు. అంతే తప్ప.. రోజంతా బ్రేక్ ఇవ్వరు. నా కెరీర్ ప్రారంభంలో పీరియడ్స్‌ వేళ నేను చాలా ఇబ్బంది పడ్డాను. దీని గురించి ఎవరితో మాట్లాడాలో..

ఏం చేయాలో అర్థం అయ్యేది కాదు. కానీ డైరెక్టర్లే అర్థం చేసుకుని.. ‘మీరు ఓకేనా.. బాగానే ఉన్నారా?’.. అని బాగోగులు అడిగేవారు. అప్పుడు కొంచెం ప్రశాంతంగా అనిపించేది. ఆ తర్వాత పీరియడ్స్‌ టైంలో నేను పెయిన్‌ కిల్లర్స్‌ వాడి షూటింగ్లో పాల్గొనేదాన్ని. మరీ ఇబ్బంది అయితే .. డైరెక్టర్‌కి చెప్తాను. అది చెప్పడానికి కూడా ఇబ్బందిగానే ఉంటుంది. కానీ అర్థం చేసుకునే వాళ్ళు అయితే బాగానే అనిపిస్తుంది” అంటూ చెప్పుకొచ్చింది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus