తెలుగు అమ్మాయి ఈషా రెబ్బ అమీ తుమీ సినిమా ద్వారా మంచి పేరు తెచ్చుకుంది. రీసెంట్ గా వచ్చిన “అ” సినిమాలోను తన నటనతో ఆశ్చర్యపరిచి మంచి ఆఫర్లు పట్టేసింది. ఇప్పుడు సుమంత్ జోడీగా నటించే అవకాశం అందుకుంది. కొత్త దర్శకుడు సంతోష్ జాగర్లమూడి దర్శకత్వంలో రూపుదిద్దుకోనున్న ఈ చిత్రానికి ‘సుబ్రహ్మణ్యపురం’ అనే టైటిల్ ని ఫిక్స్ చేశారు. తారస్ సినీకార్ప్ పతాకంపై ధీరజ్ బొగ్గారం, బీరం సుధాకర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుంది. సూపర్ న్యాచురల్ అంశాలున్న ఈ మిస్టరీ థ్రిల్లర్ మూవీలో ఈషా రెబ్బకి అద్భుత రోల్ దక్కిందని తెలిసింది. తన పాత్ర గురించి ఈషా మాట్లాడుతూ..
“‘కథ వింటున్నప్పుడు తర్వాత ఏంటి? అనే ఉత్కంఠతో ఎదురు చూశాను.ఆడియన్స్ కూడా అలానే ఫీల్ అవుతారని అనుకుంటున్నాను. నా పాత్ర పేరు ప్రియ. సుబ్రహ్మణ్యపురం గ్రామ సర్పంచ్ కి ఏకైక కుమార్తె ని. దేవుళ్ళకు ప్రతిరోజు పూజలు చేసే నేను అసలు దేవుళ్లను నమ్మని కార్తీక్ ప్రేమలో పడతాను. ఆ తర్వాత జరిగే సంఘటనలు థ్రిల్ కి గురిచేస్తాయి.’’అని వివరించారు. సుమంత్ 25 వ సినిమా అయిన దీనికి శేఖర్ చంద్ర సంగీతమందిస్తున్నారు.