హీరోయిన్ల లైఫ్ టైం మహా అయితే 5 నుండీ 8 ఏళ్ళ వరకూ ఉంటుందని చాలా మంది చెబుతుంటారు. ఎంత క్రేజ్ ఉన్నప్పటికీ.. ఫిజిక్ ను మాత్రం మెయింటైన్ చెయ్యకపోతే దర్శకనిర్మాతలు లైట్ తీసుకునే ప్రమాదం కూడా ఉందని వారు.. డైట్ ను చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. ఎంత బాగా మెయింటైన్ చేసినా.. హీరోయిన్లు 50 ఏళ్ళ వరకూ వాళ్ళ గ్లామర్ ను కాపాడుకోగలరు అని చెప్పలేము. ఒకవేళ కాపాడుకున్నా.. గ్లామర్ షో చెయ్యడానికి భయపడుతూ ఉంటారు.
అయితే ఓ హాలీవుడ్ బ్యూటీ 55ఏళ్ళ వయసులో కూడా బికినీ ధరించి కుర్రకారుని మాత్రమే కాదు బాలీవూడ్ హీరోయిన్లను కూడా కంగారు పెడుతుందట. వివరాల్లోకి వెళితే..’పాసెంజర్ 57′ ‘డేంజరస్ గ్రౌండ్’ వంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఎలిజబెత్ హర్లీ… 55ఏళ్ల వయస్సు వచ్చినా అదే గ్లామర్ ను మెయింటైన్ చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తుంది.ఈమె ఫిజిక్ చూసి బాలీవూడ్ హీరోయిన్లు సైతం షాకవుతున్నారు.తాజాగా ఈమె తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో బికినీ ధరించిన పిక్స్ ను షేర్ చేసింది.
వాటితో పాటు మోడ్రెన్ డ్రెస్సుల్లో ఉన్న పిక్స్ ను షేర్ చేసి.. ‘కోవిడ్ నిబంధనలు రీత్యా పూర్తి స్థాయిలో డ్రెస్ ధరించాల్సి వచ్చింది’ అంటూ బోల్డ్ కామెంట్స్ పెట్టింది. ప్రస్తుతం ఈమె ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. త్వరలోనే ఈమె ఓ హిందీ చిత్రంలోనూ అలాగే తమిళ చిత్రంలోనూ మెరవనుంది అని కూడా టాక్ వినిపిస్తుంది.
Most Recommended Video
‘ఆర్.ఆర్.ఆర్’ : భీమ్ పాత్రకు రాజమౌళి ఆ పాయింటునే తీసుకున్నాడా?
‘బిగ్ బాస్’ అఖిల్ గురించి మనకు తెలియని విషయాలు..!
టాలీవుడ్లో 30 కోట్ల మార్కెట్ కలిగిన హీరోలు ఎవరో తెలుసా?