ప్రేమికుల మధ్య “ఎమోషన్” ని కొలవలేము
- April 22, 2017 / 01:49 PM ISTByFilmy Focus
బాధ, సంతోషం, కోపం ఈ ఎమోషన్లలో భాగమే ప్రేమ. ఈ ప్రేమ కొందరికి ఆనందాన్ని పంచితే మరికొందరికి ఆగ్రహాన్ని తెప్పిస్తుంది. ప్రేమతో బాధ పడిన వారుకూడా లెక్కకు మించి ఉన్నారు. అటువంటి ప్రేమికుల కథని దర్శకుడు శ్రమన్ రెడ్డి “ఎమోషన్” అనే షార్ట్ మూవీలో బాగా చెప్పారు. కేవలం రెండు పాత్రలతో “ఎమోషన్” పండించిన విధానం సూపర్ గా ఉంది. శశిరేఖా పరిణయం సీరియల్ ద్వారా అందరికి పరిచయమైనా మేఘన లోకేష్ ఇందులో ప్రేమికురాలిగా ఒక కంట ఆనందాన్ని, మరో కంట విషాదాన్ని పలికించింది.
ప్రేమికుడిగా అంజన్ అద్భుతంగా నటించాడు. శివ శంకర వర ప్రసాద్ కెమెరా పనితనాన్ని అభినందించకుండా ఉండలేము. చివర్లో “ప్రేమ సమస్య కాదు.. చావు పరిష్కారం అంతకన్నా కాదు”.. అని సందేశాన్ని అందిస్తున్న ఈ షార్ట్ ఫిల్మ్ యువతీయువకుల హృదయాల్లో స్థానం సంపాదించుకుంటుంది.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.














