Bigg Boss Telugu 6: హౌస్ మేట్స్ తో ఎమోషనల్ గా ఆడుకుంటున్న బిగ్ బాస్. టాస్క్ లో జరిగేది ఇదే..!

బిగ్ బాస్ హౌస్ లో ఆరోవారం కెప్టెన్సీ రేస్ టాస్క్ మొదలైంది. ఇందులో భాగంగా వందశాతం ఉన్న బ్యాటరీని గార్డెన్ ఏరియాలో హౌస్ మేట్స్ కోసం పెట్టాడు బిగ్ బాస్. ఒక్కొక్కరిని కన్ఫెషన్ రూమ్ కి పిలిచి కంపల్సరీగా బ్యాటరీని వాడుకోవాలని కండీషన్ పెట్టాడు. ఇక్కడ మూడు ఆప్షన్ ఇచ్చాడు. ఇందులో ఇంటి నుంచీ వచ్చే ఫుడ్, ఆడియోకాల్, ఇంకా వీడియాకాల్ అప్షన్స్ ఉన్నాయి. ఇందులో హౌస్ మేట్ బిగ్ బాస్ ఇచ్చిన ఛార్జింగ్ పర్సెంటేజ్ ని ఎంచుకోవాలి.

దానిని బట్టీ మిగతా వారి ఆట ఉంటుంది. ఫస్ట్ హౌస్ లోకి వచ్చిన శ్రీహాన్ ఇంచి నుంచీ మటన్ బిర్యానీకోసం 15శాతం బ్యాటరీని వాడాడు. అలాగే సుదీప ఆడియోకాల్ ని, ఆదిరెడ్డి వీడియాకాల్ ని వాడుకున్నాడు. దీంతో బ్యాటరీ కేవలం 5శాతం మాత్రమే మిగిలింది. నిజానికి 15శాతం వరకూ ఉండాలి. కానీ, హౌస్ లో కెప్టెన్ అయిన రేవంత్ పడుకోవడం వల్ల, అలాగే గీతు మైక్ సరిగ్గా ధరించకపోవడం వల్ల 10శాతం బ్యాటరీని కోల్పోయారు. దీంతో చివరి 5 శాతం మాత్రమే మిగిలింది.

ఇప్పుడు బిగ్బాస్ అసలైన ఆట మొదలుపెట్టాడు. హౌస్ లో బ్యాటరీ తిరిగి 100శాతం పొందాలంటే కఠినమైన నిర్ణయాలు తీస్కోవాలని కండీషన్స్ పెట్టాడు. ఈ కండీషన్స్ కి హౌస్ మేట్స్ ఒప్పుకుంటేనే తిరిగి బ్యాటరీ 100శాతం వస్తుంది. గీతుని కన్ఫెషన్ రూమ్ లోకి పిలిచిన బిగ్ బాస్ బాలాదిత్య స్మోకింగ్ మానేస్తే తిరిగి 100శాతం బ్యాటరీ వస్తుందని చెప్పాడు. దీంతో హౌస్ మేట్స్ కి గేమ్ పూర్తిగా అర్దమైంది. వాళ్లు చేసే త్యాగం వల్ల బ్యాటరీ పర్సెంటేజ్ పెరుగుతుంది.

దీంతో ఇప్పుడు హౌస్ మేట్స్ ఈటాస్క్ కి ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యారు. ఈ టాస్క్ లో ఫైమా ఛాలెంజ్ ని ఫినిష్ చేసి 50శాతం బ్యాటరీని సంపాదించినట్లుగా తెలుస్తోంది. అలాగే, శ్రీసత్య తన ఫ్యామిలీతో వీడియోకాల్ మాట్లాడేటపుడు బాగా ఎమోషనల్ అయిపోయిందని , వెక్కి వెక్కి ఏడ్చిందని సమాచారం. ఇక బాలాదిత్య, అర్జున్ ఇద్దరూ ఆడియోకాల్ మాట్లాడితే, రాజ్ వీడియో కాల్ మాట్లాడాడు. ఈరోజు జరిగే ఎపిసోడ్ లో బాలాదిత్య, అర్జున్, రాజ్, ఇంకా ఫైమా గేమ్ టెలికాస్ట్ అవ్వబోతోంది.

అలాగే, శ్రీసత్య వీడియోకాల్ బాగా ఎమోషనల్ గా సాగబోతోంది. ఇది హైలెట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏది ఏమైనా బిగ్ బాస్ హౌస్ లో ఈసారి టాస్క్ హౌస్ మేట్స్ కి బూస్టప్ ఇస్తుందనే చెప్పాలి. ఇంటి నుంచీ కాల్ వచ్చిన తర్వాత వాళ్ల గేమ్ లో ఖచ్చితంగా మార్పు వస్తుంది. అలాగే, ఇంట్లో వాళ్లు ఇచ్చే హింట్స్ , గేమ్ గురించి చెప్పడం వల్ల వాళ్ల గేమ్ స్టైల్ ని కూడా మారుస్తారు.

గాడ్ ఫాదర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ది ఘోస్ట్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కపుల్ కంటెస్టెంట్స్ రోహిత్ అండ్ మెరీనా గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ శ్రీహాన్ గురించి ఆసక్తికర విషయాలు..!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus