Enemy Movie: విశాల్- ఆర్య ల ‘ఎనిమి’.. తెలుగు థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

  • November 3, 2021 / 06:16 PM IST

కోలీవుడ్ హీరో విశాల్ నటించిన లేటెస్ట్ మూవీ ‘ఎనిమి’. మరో హీరో ఆర్య కీలక పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని దర్శకుడు ఆనంద్ శంకర్ తెరకెక్కించాడు. విశాల్ పోలీస్ ఆఫీసర్ గా…. ఆర్య నెగిటివ్ రోల్లో తెరకెక్కిన ఈ చిత్రంలో ‘గద్దలకొండ గణేష్‌’ ఫేమ్ మృణాళిని హీరోయిన్‌గా నటిస్తుండడం విశేషం.ఎస్.వినోద్ కుమార్ నిర్మించిన ఈ చిత్రంలో ఓ పాటని సంగీత దర్శకుడు తమన్ కంపోజ్ చేయగా.. బ్యాక్గ్రౌండ్ స్కోర్ సామ్ సి.ఎస్ కంపోజ్ చేసాడు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్లకు మంచి స్పందన లభించింది. దాంతో దీపావళి కానుకగా నవంబర్ 4న విడుదల కాబోతున్న ఈ చిత్రానికి మంచి బిజినెస్ జరిగింది.

ఒకసారి వాటి వివరాలను గమనిస్తే :

నైజాం  2.00 cr
సీడెడ్  0.85 cr
ఆంధ్రా(టోటల్)  0.95 cr
ఏపి+తెలంగాణ (టోటల్)  3.80 cr

‘ఎనిమి’ చిత్రానికి రూ.3.8 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. బ్రేక్ ఈవెన్ కు ఈ చిత్రం రూ.4 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది. టార్గెట్ చిన్నదే అయినా దానిని రీచ్ అవ్వడం అంత ఈజీ అయితే కాదనే చెప్పాలి. ఎందుకంటే పోటీగా రజినీకాంత్ ‘పెద్దన్న’, మారుతీ తెరకెక్కించిన ‘మంచిరోజులు వచ్చాయి’ వంటి సినిమాలు ఉన్నాయి. వాటి పోటీని తట్టుకుని నిలబడడం చాలా కష్టం. మొదటి వీకెండ్ కే భారీ ఓపెనింగ్స్ నమోదైతే తప్ప అది అసాధ్యమే..!

వరుడు కావలెను సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రొమాంటిక్ సినిమా రివ్యూ & రేటింగ్!
పునీత్ రాజ్ కుమార్ సినీ ప్రయాణం గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
ఇప్పటివరకు ఎవ్వరూ చూడని పునీత్ రాజ్ కుమార్ ఫోటోలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus