Enemy Collections: డీసెంట్ ఓపెనింగ్స్ ను రాబట్టిన ‘ఎనిమి’..!

  • November 5, 2021 / 04:47 PM IST

కోలీవుడ్ హీరో విశాల్ నటించిన లేటెస్ట్ మూవీ ‘ఎనిమి’. మరో హీరో ఆర్య కీలక పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని దర్శకుడు ఆనంద్ శంకర్ తెరకెక్కించాడు. విశాల్ పోలీస్ ఆఫీసర్ గా…. ఆర్య నెగిటివ్ రోల్లో తెరకెక్కిన ఈ చిత్రంలో ‘గద్దలకొండ గణేష్‌’ ఫేమ్ మృణాళిని హీరోయిన్‌గా నటించింది.ఎస్.ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్లకు మంచి స్పందన లభించడంతో ఈ సినిమా అంచనాలు బాగానే నమోదయ్యాయి. అయితే నిన్న విడుదలైన ఈ చిత్రానికి యావరేజ్ టాక్ మాత్రమే లభించింది. ఓపెనింగ్స్ కూడా యవరేజ్ గానే నమోదయినప్పటికీ నిన్న విడుదలైన పెద్దన్న, మంచిరోజులు వచ్చాయి చిత్రాలతో పోలిస్తే బెటర్ అనిపించింది.

మొదటి రోజు కలెక్షన్లను ఓసారి గమనిస్తే :

నైజాం 0.38 cr
సీడెడ్ 0.16 cr
ఉత్తరాంధ్ర 0.12 cr
ఈస్ట్ 0.09 cr
వెస్ట్ 0.06 cr
గుంటూరు 0.13 cr
కృష్ణా 0.06 cr
నెల్లూరు 0.06 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 1.06 cr

‘ఎనిమి’ చిత్రానికి రూ.3.8 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. బ్రేక్ ఈవెన్ కు ఈ చిత్రం రూ.4 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది. టార్గెట్ చిన్నదే కానీ మొదటి రోజు ఈ చిత్రం రూ.1.06 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కు మరో రూ.2.94 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.

వరుడు కావలెను సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రొమాంటిక్ సినిమా రివ్యూ & రేటింగ్!
పునీత్ రాజ్ కుమార్ సినీ ప్రయాణం గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
ఇప్పటివరకు ఎవ్వరూ చూడని పునీత్ రాజ్ కుమార్ ఫోటోలు..!

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus