Enemy Collections: దీపావళికి రిలీజైన సినిమాల్లో ఇదే బెటర్ అనిపించింది..!

  • November 8, 2021 / 04:22 PM IST

కోలీవుడ్ హీరో విశాల్ నటించిన లేటెస్ట్ మూవీ ‘ఎనిమి’. మరో హీరో ఆర్య కీలక పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని దర్శకుడు ఆనంద్ శంకర్ తెరకెక్కించాడు. విశాల్ పోలీస్ ఆఫీసర్ గా…. ఆర్య నెగిటివ్ రోల్లో తెరకెక్కిన ఈ చిత్రంలో ‘గద్దలకొండ గణేష్‌’ ఫేమ్ మృణాళిని హీరోయిన్‌గా నటించింది.ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్లకు మంచి స్పందన లభించడంతో ఈ సినిమా అంచనాలు బాగానే నమోదయ్యాయి. అయితే నవంబర్ 4న దీపావళి కానుకగా విడుదలైన ఈ చిత్రం యావరేజ్ టాక్ ను మాత్రమే రాబట్టుకుంది. ఓపెనింగ్స్ కూడా సో సోగా ఉన్నప్పటికీ దీపావళికి విడుదలైన సినిమాల్లో ఇదే కాస్త బెటర్ అనిపించింది.

ఫస్ట్ వీకెండ్ కలెక్షన్లను ఓసారి గమనిస్తే :

నైజాం 0.76 cr
సీడెడ్ 0.41 cr
ఉత్తరాంధ్ర 0.27 cr
ఈస్ట్ 0.18 cr
వెస్ట్ 0.13 cr
గుంటూరు 0.21 cr
కృష్ణా 0.15 cr
నెల్లూరు 0.11 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 2.22 cr

‘ఎనిమి’ చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో రూ.3.8 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. బ్రేక్ ఈవెన్ కు ఈ చిత్రం రూ.4 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది. టార్గెట్ చిన్నదే కానీ మొదటి వీకెండ్ పూర్తయ్యేసరికి ఈ చిత్రం రూ.2.22 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కు మరో రూ.2.78 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. వీక్ డేస్ లో కూడా ఇలా స్టడీ గా రాబడితే తప్ప బ్రేక్ ఈవెన్ అసాధ్యమనే చెప్పాలి.

వరుడు కావలెను సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రొమాంటిక్ సినిమా రివ్యూ & రేటింగ్!
పునీత్ రాజ్ కుమార్ సినీ ప్రయాణం గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
ఇప్పటివరకు ఎవ్వరూ చూడని పునీత్ రాజ్ కుమార్ ఫోటోలు..!

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus