Enemy Review: ఎనిమీ సినిమా రివ్యూ & రేటింగ్!

  • November 4, 2021 / 05:58 PM IST

విశాల్-ఆర్య ప్రధాన పాత్రల్లో తమిళంలో తెరకెక్కిన చిత్రం “ఎనిమీ”. యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ చిత్రానికి “ఇంకొకడు, నోటా” చిత్రాల ఫేమ్ ఆనంద్ శంకర్ దర్శకుడు. ఈ సినిమా ట్రైలర్ ఆడియన్స్ ను విశేషంగా ఆకట్టుకుంది. మరి సినిమా అదే స్థాయిలో అలరించిందో లేదో చూద్దాం..!!

కథ: చిన్నప్పటి నుంచి కలిసి పెరిగిన స్నేహితులు సూర్య (విశాల్), రాజీవ్ (ఆర్య). వీళ్లిద్దరినీ పోలీస్ ఆఫీసర్లను చేయడం కోసం ట్రైనింగ్ ఇస్తుంటాడు పారి (ప్రకాష్ రాజ్). కట్ చేస్తే.. మంచి స్నేహితులుగా పెరిగిన వీరిద్దరూ బద్ధ శత్రువుల్లా మారిపోతారు. ఒకరితో ఒకరు తలపడడమే కాక.. సమాజానికి ప్రమాదంలా మారుతారు. అసలు వీళ్ళద్దరు శత్రువుల్లా ఎందుకు మారారు? ఆ శత్రుత్వం వల్ల సమాజానికి ఏర్పడిన నష్టం ఏమిటి? అనేది “ఎనిమీ” కథాంశం.

నటీనటుల పనితీరు: విశాల్, ఆర్యలకు ఈ తరహా పాత్రలు కొత్త కాదు. ఆనంద్ శంకర్ వీళ్ళతో కొత్తగా ఏదో చేయించాలని అస్సలు ప్రయత్నించలేదు. మృణాళిని, మమతా మోహన్ దాస్ ల పాత్రలకు క్లారిటీ లేదు. ప్రకాష్ రాజ్, తంబి రామయ్య తమ పాత్రలకు న్యాయం చేశారు.

సాంకేతికవర్గం పనితీరు: దర్శకుడు ఆనంద్ శంకర్ తెలివైన సినిమాలు మాత్రమే తీస్తాను అంటూ “నోటా” తర్వాత దాదాపు మూడేళ్ళ గ్యాప్ తీసుకొని మరీ తెరకెక్కించిన చిత్రం “ఎనిమీ”. యాక్షన్ సినిమాలకి లాజిక్ అవసరం లేదు సరే.. కానీ కామన్ సెన్స్ ఉండాలి అనే విషయాన్ని కూడా విస్మరించాడు ఆనంద్ శంకర్. అందువల్ల సినిమాలో బోలెడంత యాక్షన్ ఉన్నప్పటికీ.. కథ-కథనంలో ఆడియన్స్ ను కనెక్ట్ చేసే అంశాలు మాత్రం చాలా తక్కువగా ఉంటాయి.

పోనీ సినిమా మొత్తం యాక్షన్ ఉంటుందా అంటే అదీ లేదు. అందువల్ల సినిమా మొత్తం అనవసరమైన ఎపిసోడ్లతో బోర్ కొట్టిస్తుంది. తమన్ పాటల కంటే సామ్ నేపధ్య సంగీతం బాగుంది. ఆర్.డి.రాజశేఖర్ సినిమాటోగ్రఫీ మాత్రం అదిరిపోయింది. సినిమాని థియేటర్లో అంతసేపు కూర్చుని చూడగలిగాం అంటే కారణం ఆ కెమెరా వర్క్ మాత్రమే. ప్రొడక్షన్ డిజైన్ కూడా బాగుంది.

విశ్లేషణ: లాజిక్, సెన్స్ లాంటివి ఏమీ పట్టించుకోకపోతేనే ఈ ఎనిమీని కాస్తో కూస్తో ఎంజాయ్ చేయగలరు. లేదంటే మాత్రం కష్టమే. యాక్షన్ సీన్స్ కోసం వెళ్లే వాళ్ళు మాత్రం హ్యాపీ ఫీల్ అవుతారు.

రేటింగ్: 2.5/5

Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus