యంగ్ హీరో రామ్ పోతినేని ‘రెడ్’ సినిమాలో తొలిసారి డ్యూయల్ రోల్ లో కనిపించాడు. ఈ సినిమాకి మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ రెండు విభిన్న పాత్రల్లో రామ్ తన నటనతో ఆకట్టుకున్నాడు. రెండు పాత్రల్లో వేరియేషన్స్ చూపిస్తూ కాన్ఫిడెంట్ గా నటించాడు. ఇప్పుడు ఏకంగా ట్రిపుల్ రోల్ చేయడానికి రెడీ అవుతున్నట్లు టాలీవుడ్ లో వార్త చక్కర్లు కొడుతోంది. రీసెంట్ గా ఓ కొత్త దర్శకుడు హీరో రామ్ ని కలిసి కథ వినిపించాడట. కథ ఇంప్రెసివ్ గా అనిపించడంతో రామ్ సినిమా చేస్తానని హామీ ఇచ్చాడట.
కథ ప్రకారం ఇందులో రామ్ త్రిపాత్రాభినయం చేయబోతున్నాడని టాక్. దర్శకత్వ శాఖలో అనుభవం లేని ఓ కొత్త దర్శకుడిని నమ్మి రామ్ ట్రిపుల్ రోల్ లో కనిపించడానికి రిస్క్ చేస్తుండడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. సబ్జెక్ట్ కూడా రిస్క్ తో కూడుకున్నది కావడంతో ఈ సినిమాను తన హోమ్ బ్యానర్ స్రవంతి మూవీస్ లోనే రామ్ చేయబోతున్నాడని సమాచారం. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన ప్రకటన వచ్చే ఛాన్స్ ఉంది.
నిజానికి ‘రెడ్’ సినిమా తరువాత రామ్ తన తదుపరి సినిమా త్రివిక్రమ్ తో చేస్తాడని వార్తలొచ్చాయి. ‘రెడ్’ ప్రీరిలీజ్ ఈవెంట్ కి త్రివిక్రమ్ గెస్ట్ గా వచ్చి రామ్ ని గొప్ప నటుడంటూ పొగడడంతో వీరి కాంబో పక్కా అని అంతా అనుకున్నారు. కానీ ఈ కాంబినేషన్ పై ఎలాంటి ప్రకటన రాలేదు. త్రివిక్రమ్ ఈ వేసవి నుండి ఎన్టీఆర్ సినిమాను మొదలుపెట్టే ప్రయత్నాల్లో ఉన్నాడు. దీంతో రామ్ కొత్త డైరెక్టర్ తో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు.
Most Recommended Video
జాంబీ రెడ్డి సినిమా రివ్యూ & రేటింగ్!
తెలుగులో క్రేజ్ ఉన్న ఈ 10 యాంకర్ల వయసు ఎంతో మీకు తెలుసా
శృతీ ఈ సినిమాలను రిజెక్ట్ చేసి మంచి పనే చేసిందా..?