రామ్ చరణ్ గురించి ఆసక్తికర విషయం చెప్పిన ర‌త్న‌వేలు.!

పాతికేళ్ళక్రితం నటి కథ.. ఓ గ్రామంలో జరిగే ఎన్నికల గొడవలు.. ఆ ఊరి ప్రజల మధ్య అనుబంధం.. ప్రేమ.. అనురాగం.. ఈ లైన్ వినగానే ఎవరైనా.. ఈ సమయంలో ఎందుకుబాబు.. ఈ సాహసం అని అంటారు. కానీ సుకుమార్ టీమ్ మాత్రం ఈ కథని నమ్మింది. కష్టపడింది. కలెక్షన్లతో పాటు అభినందనలు అందుకుంది. ఈ చిత్రంలో నటించిన నటీనటులకే కాకుండా సాంకేతిక నిపుణులకు కూడా మంచి పేరు తెచ్చిపెట్టింది.

సినిమాటోగ్రాఫ‌ర్ ర‌త్న‌వేలు గురించి అయితే ప్రతి ఒక్కరు మాట్లాడుకుంటున్నారు. 1980ల నాటి కాలాన్ని తన కెమెరా పనితనంతో కళ్లకి కట్టారని అభినందిస్తున్నారు. ఈ సందర్భంగా మీడియా ముందుకు వచ్చిన రత్నవేలు తన అనుభవాన్ని పంచుకున్నారు. “ఒక సినిమా హిట్ అయితే ఆ సినిమా ద‌ర్శ‌కుడికో, హీరోకో పేరొస్తుంది. ఈ సినిమా విష‌యంలో మాత్రం సాంకేతిక బృందానికి కూడా పేరొచ్చింది. ఈ సినిమా విజ‌యం చాలా ఆనందాన్ని క‌లిగించింది. ఈ సినిమాలో రామ్‌చ‌ర‌ణ్ న‌ట‌న గురించి అంద‌రూ మాట్లాడుకుంటున్నారు. రామ్‌చ‌ర‌ణ్ స‌హ‌జ‌మైన న‌టుడ‌నే విష‌యం నాకు సెట్‌కు వెళ్లిన రెండో రోజే తెలిసింది. ఆ విష‌యం అప్పుడే చ‌ర‌ణ్‌కు చెప్పా. చ‌ర‌ణ్ క‌ష్టం ఫలించింది” అని ర‌త్న‌వేలు తెలిపారు. సమంత హీరోయిన్ గా నటించిన ఈ సినిమా తెలుగు చిత్ర పరిశ్రమలోని నాన్ బాహుబలి రికార్డులన్నింటినీ తిరగరాస్తోంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus