Epic: రెండో ‘ఎపిక్’ కూడా ఉందా? టైటిల్ అర్థం అదేనా?
- September 7, 2026 / 10:24 AM ISTByFilmy Focus Desk
సినిమా అంతా చూశాక.. లాస్ట్‌లో మళ్లీ కలుద్దాం అని చెప్పడం మనకు కొత్తేమీ కాదు. గత కొన్నేళ్లుగా ఇలాంటి సర్‌ప్రైజ్‌లు చూస్తూనే ఉన్నాం. అందులో చాలా సినిమాలు తెరకెక్కడం లేదు ఆ లెక్కన ఆ సీక్వెల్స్ రావడం లేదు. ఇప్పుడు ఈ సీక్వెల్ టాపిక్ ఎందుకు అనుకుంటున్నారా? త్వరలో రిలీజ్ కాబోతున్న ఓ సినిమాకు కూడా సీక్వెల్ కూడా రాబోతోంది అని సమాచారం ఉండటమే. అయితే ఆ సీక్వెల్ సంగతి తేలాలి అంటే ఇప్పుడు రెడీ అయిన సినిమా వస్తే కానీ చెప్పలేం అంటున్నారు.
Epic Movie
ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య హీరోహీరోయిన్లుగా రూపొందిన సినిమా ‘ఎపిక్’ (Epic). దీనికి ఫస్ట్ సెమిస్టర్ అనే లింక్. ఆదిత్య హాసన్ తెరకెక్కించిన ఈ సినిమాను ఈ నెల 11న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. సినిమా టైటిల్ ఆఖరున ఇచ్చిన లింకే ఇప్పుడు సినిమాకు సీక్వెల్ ఉంటుంది అని చెప్పడానికి కారణం. ఆ సినిమా కొంత మేరకు చిత్రీకరణ కూడా జరుపుకుందని సమాచారం. ‘ఎపిక్: ఫస్ట్ సెమిస్టర్’ వచ్చాక ఆ ఫలితం బట్టి రెండో సెమిస్టర్ తీసుకొస్తారని టాక్.

‘90s – ఏ మిడిల్ క్లాస్ బయోపిక్’ వెబ్ సిరీస్‌కి కొనసాగింపుగా రూపొందుతున్న సినిమా అంటూ ‘ఎపిక్’ను తెరకెక్కిస్తున్నట్లు తొలుత చెప్పారు. అయితే.. ఆ తర్వాత రెండిటికీ సంబంధం లేదు అని చెబుతూ వచ్చారు. ఆ మధ్య రిలీజైన టీజర్‌లో కూడా ఇదే విషయాన్ని కన్వే చేశారు. కానీ ట్రైలర్ దగ్గరకు వచ్చేసరికి ఆ వైబ్ లేకుండా చూసుకున్నారు. ఈ నేపథ్యంలో సినిమా చూస్తే కానీ ఈ విషయం అర్థం కాదు. అలాగే సినిమా క్లైమాక్స్ నాటికి సీక్వెల్ విషయంలో క్లారిటీ వస్తుంది.

ఇక ఈ సినిమా ట్రైలర్ విషయానికొస్తే.. జెన్ జీకి కనెక్ట్ అయ్యేలా సినిమా కాన్సెప్ట్ కనిపిస్తోంది. రిలేషన్, ఆ తర్వాత అంశాల గురించి ఎక్కువగా చర్చించారు. అయితే కొన్ని పదాలు, ప్రస్తావనలు నేరుగా ప్రస్తావించడంతో రిలీజ్ అయ్యాక ఎలాంటి చర్చలు జరుగుతాయి అనేది చూడాలి.
తెలుగు రాష్ట్రాల్లోనే రూ.100 కోట్ల షేర్.. పాన్ ఇండియా సినిమాల రేంజ్లో ‘ఇరుముడి’ వసూళ్ళు












