ఆనాడు.. ఈనాడు క్రేజ్ తగ్గని హిట్ పెయిర్స్

వెండితెరపై కొన్ని జంటల మధ్య కెమిస్ట్రీ బాగా వర్కవుట్ అవుతుంది. నిజమైన ప్రేమికులుగా, భార్య భర్తలుగా అనిపిస్తారు. అందుకే ఆ పెయిర్ నటించిన సినిమాలు సూపర్ హిట్ అవుతాయి. ఆ హిట్ పెయిర్ పదేళ్లు, ఇరవై ఏళ్లు తర్వాత తెరపైన కనిపించినప్పటికీ వారి మధ్య కెమిస్ట్రీలో మార్పు ఉండదు. అలా టాలీవుడ్ లో ఆనాడు.. ఈనాడు క్రేజ్ తగ్గని హిట్ పెయిర్స్ పై ఫోకస్…

బాలకృష్ణ – శ్రియ చెన్నకేశవ రెడ్డి చిత్రంలో బాలకృష్ణ, శ్రియ కలిసి నటించారు. 2002 లో వచ్చిన ఈ సినిమాలో వీరిద్దరూ పర్ఫెక్ట్ జోడీగా కనిపించారు. మళ్లీ 2017 .. అంటే పదిహేనేళ్ళ తర్వాత “గౌతమి పుత్ర శాతకర్ణి” మూవీలో భార్యాభర్తలుగా నటించి సరిజోడీ అనిపించుకున్నారు. అప్పుడు మిస్సయిన విజయాన్ని ఇప్పుడు సొంతం చేసుకున్నారు.

వెంకటేష్ – మీనా వెంకటేష్, మీనాలను తెరపై చూస్తుంటే ఒకరికోసం ఒకరు పుట్టారా? అనిపిస్తుంటుంది. వీరిద్దరి కలిసి నటించిన చంటి, సుందర కాండ, అబ్బాయిగారు, సూర్యవంశం వంటి చిత్రాలు వంద రోజులు ఆడాయి. ఈ జంట మధ్య కెమిస్ట్రీ 22 ఏళ్ళ తర్వాత కూడా మిస్ కాలేదు. 2014 లో దృశ్యం సినిమాలో భార్య భర్తలుగా ప్రేక్షకుల మనసు దోచుకున్నారు.

నాగార్జున – రమ్యకృష్ణటాలీవుడ్ మన్మధుడు నాగార్జున పక్కన ఏ హీరోయిన్ అయిన సెట్ అయిపోతుంది. జోడీగా రమ్యకృష్ణ ఉంటే అక్కడ రొమాన్స్ చాలా బాగుంటుంది. అందుకే వీరు నటించిన హలో బ్రదర్, ఘరానా బుల్లోడు సినిమాలు బ్లాక్ బస్టర్ గా నిలిచాయి. లేటెస్ట్ గా సోగ్గాడే చిన్ని నాయనా చిత్రంలో అలనాటి రొమాన్స్ ని నాగార్జున, రమ్యకృష్ణ మళ్ళీ తెరపై చుపించారు.

నాగార్జున – శ్రియ సంతోషం సినిమాలో నాగార్జున, శ్రియల మధ్య లవ్ స్టోరీ అందరినీ కంటతడి పెట్టించింది. 2002 లో వచ్చిన ఈ మూవీ అందరి మనసులో మంచి జ్ఙాపకంగా మిగిలిపోయింది. ఆగుర్తులను తట్టిలేపింది మనం మూవీ. పన్నెండేళ్ల తర్వాత నాగ్, శ్రియ కలిసినటించినప్పటికీ అదే మ్యాజిక్ వర్కవుట్ అయింది.

జగపతి బాబు – సుకన్య జగపతిబాబు సినీ కెరీర్ లో తొలి భారీ హిట్ పెద్దరికం. ఇందులో జగపతిబాబు, సుకన్యల మధ్య ప్రేమ ఆకట్టుకుంది. మళ్లీ ఇరవై మూడేళ్ళ తర్వాత శ్రీమంతుడులో మహేష్ బాబు కి తల్లిదండ్రులుగా చక్కగా నటించారు. ఈనాటికీ వారిద్దరి మధ్య అదే కెమిస్ట్రీ.

రాజేంద్రప్రసాద్ – ఆమనిభార్యాభర్తలు అంటే ఇలా ఉండాలి అని మిస్టర్ పెళ్ళాం సినిమా ద్వారా బాపు చెప్పారు. ఇందులో వెండితెర పర్ఫెక్ట్ కపుల్ గా రాజేంద్ర ప్రసాద్, ఆమని నటించారు. మళ్లీ పదేళ్ల తర్వాత మీ శ్రేయాభిలాషి చిత్రంలో భార్య భర్తలుగా కనిపించారు. నేటి ఆలుమగలు ఇలా ఉంటారని తమ నటనతో చూపించారు.

నరేష్ – ఆమని 90 వ దశకంలో ఆమని మంచి ఫామ్లో ఉన్నారు. అప్పుడు ఆమె ఆనాటి హీరోలతో నటించారు. ఆమని కొంటె తనానికి, నరేష్ చిలిపితనాన్ని బాగా జోడి కుదిరింది. అందుకే వీరిద్దరూ హిట్ పెయిర్ గా గుర్తింపు పొందారు. జంబలకిడి పంబ చిత్రంలో మెప్పించిన ఈ జోడీ, 21 ఏళ్ళ తర్వాత మళ్లీ చందమామ కథలు చిత్రంతో అలరించింది.

సుమన్ – భానుప్రియ 1983 లో వచ్చిన సితార మూవీ మహిళా ప్రేక్షకుల మనసుదోచుకుంది. ఇందులో సుమన్, భానుప్రియ మధ్య ప్రేమానురాగాలు బాగా పండాయి. మళ్లీ ఈజంట ఎన్టీఆర్ సినిమా దమ్ములో కనిపించింది. తమదైన నటనతో హిట్ పెయిర్ అనిపించుకుంది.

నరేష్ – సితార మనసు మమత చిత్రంలో నరేష్, సితార కలిసి నటించారు. అందులో వీరిద్దరూ ముచ్చటైన జంటగా ప్రశంసలు అందుకున్నారు. సరిగ్గా పాతికేళ్ల తర్వాత వీరిద్దరూ నాని “భలే భలే మగాడివోయ్” చిత్రంలో నటించి మంచి మార్కులు కొట్టేశారు.

మోహన్ బాబు – మీనా – రమ్యకృష్ణ మోహన్ బాబు, మీనా, రమ్యకృష్ణ ఈ మూడు పేర్లు చెప్పగానే అందరికీ గుర్తు వచ్చే సినిమా అల్లరిమొగుడు. ఇందులో వీరి ముగ్గురు చేసే హడావుడి నవ్వులు పూయించింది. మోహన్ బాబుకి మీనా, రమ్యకృష్ణ లతో కెమిస్ట్రీ చక్కగా కుదిరింది. మళ్లీ వీరు ముగ్గురు 23 ఏడేళ్ల తర్వాత “మామ మంచు అల్లుడు కంచు” సినిమాతో కితకితలు పెట్టించారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus