మెగా పవర్ స్టార్ రాంచరణ్.. ‘ఆర్.ఆర్.ఆర్’ షూటింగ్ లో జాయిన్ అవ్వగానే కోర మీసం పెంచి కొత్త లుక్ లోకి మారాడు. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ భారీ మల్టీస్టారర్ చిత్రంలో చరణ్.. అల్లూరి సీతారామ రాజు పాత్ర పోషిస్తున్నాడు కాబట్టి… సంవత్సరం పైనే ఇదే లుక్ మెయింటైన్ చేస్తూ వచ్చాడు.లాక్ డౌన్ కు ముందు క*నా వైరస్ గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పడానికి ఎన్టీఆర్ తో కలిసి చేసిన వీడియోలో కూడా చరణ్ అదే లుక్ లో కనిపించాడు.
అయితే ఇప్పుడు చరణ్ లుక్ పూర్తిగా మారిపోయింది. నిన్న ప్రముఖ టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాష్టర్ పుట్టిన రోజు కావడంతో.. అతనికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ ఓ వీడియోని రిలీజ్ చేశాడు చరణ్. అందులో చరణ్ లుక్ భయపెట్టే విధంగా ఉందనే చెప్పాలి. విపరీతంగా గడ్డం, జుట్టు పెంచేసాడు. మోహంలో ఇదివరకు ఉన్న గ్లో అస్సలు లేదు. చాలా నీరసంగా కనిపిస్తున్నాడు. అసలు చరణ్ ఎందుకు ఇలా మారిపోయాడు. ఈ లాక్ డౌన్ లో చాలా మంది సెలబ్రిటీలు ఇళ్లల్లోనే ఉంటూ ఫిట్నెస్ ను కోల్పోయారు.
కానీ చరణ్ మాత్రం మోహంలో ఉన్న కళ మొత్తం పోగొట్టుకున్నాడని కొంతమంది కామెంట్స్ చేస్తుంటే.. మరికొంత మంది ‘ఒకవేళ తన తండ్రి ‘ఆచార్య’ చిత్రంలో గెస్ట్ రోల్ చేస్తున్నాడు కాబట్టి.. ఇలా మారిపోయాడేమో? ఎలాగూ ఆ పాత్ర ఫ్లాష్ బ్యాక్ లో వస్తుంది. అందులోనూ కమ్యూనిస్ట్ పాత్ర కూడా కాబట్టి ఇలా మారిపోయి ఉంటాడు’ అని అంచనాలు వేస్తున్నారు.
Most Recommended Video
భానుమతి & రామకృష్ణ సినిమా రివ్యూ & రేటింగ్!
సినిమాల్లోకి రాకముందు మన హీరోయిన్స్ ఎలా ఉంటారో చూస్తే.. షాక్ అవ్వాల్సిందే..!
అట్టర్ ఫ్లాప్ సీజన్ అంటే ఇదేనేమో..!